Revanth Reddy: వరి ధాన్యం కొనుగోలు విషయంలో (Paddy Procurement) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై టీపీసీసీ చీఫ్ రేవంత్  రెడ్డి (Revanth Reddy) తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రైతుల పట్ల వ్యతిరేకతను కేంద్రం మరోసారి బయటపెట్టుకుందని అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ కలిసి డ్రామా ఆడుతున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం (TRS Government) కొనుగోలు చేయకూడదా అని సీఎం కేసీఆర్‌ను (CM KCR) ప్రశ్నించారు. రైతు సంక్షేమం గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచించట్లేదని నిలదీశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా రేవంత్ రెడ్డి మంగళవారం (నవంబర్ 30) ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రైతుల కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పే టీఆర్ఎస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయలేదా రేవంత్ రెడ్డి (Revanth Reddy ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు చేయని పక్షంలో ఇక రూ.వేల కోట్లతో ప్రాజెక్టులు నిర్మించడమెందుకు... రైతు బంధు ఎందుకని నిలదీశారు. ఏం పంటను కొనుగోలు చేయకపోతే ఇక ప్రభుత్వమెందుకు అని ప్రశ్నించారు. అసలు వ్యవసాయంపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక పాలసీ లేకుండా పోయిందని విమర్శించారు. 


రాష్ట్రంలోని రైతులకు విత్తనాలు, వ్యవసాయ పరికరాలపై సబ్సిడీ అందట్లేదని ఆరోపించారు. పసుపు బోర్డు తెస్తానన్న బీజేపీ (Telangana BJP) రైతులను మోసం చేసిందని... కేసీఆర్ (CM KCR) షుగర్ ఫ్యాక్టరీలను మూసివేసి రైతులకు నష్టం చేశారని విమర్శించారు. అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 750 మంది రైతుల చావులకు కారణమైందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రైతు చావులకు ప్రధాని మోదీదే బాధ్యత అన్నారు.


Also Read: Big Shock to a Son: ఆస్తి కోసం పోరు పెట్టిన కొడుక్కి ఊహించని షాకిచ్చిన తండ్రి...


యాసంగి ధాన్యం కొనుగోలుపై (Paddy Procurement) గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. కేంద్రం యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయమంటోందని... కాబట్టి యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవని సీఎం కేసీఆర్ (CM KCR) తేల్చేసిన సంగతి తెలిసిందే. అంత భారీ మొత్తంలో ధాన్యాన్ని నిల్వ చేసే వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం వద్ద మాత్రమే ఉందని... రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఆ సదుపాయాలు లేవని చెప్పారు. రైతు బంధు, ఉచిత విద్యుత్ అందిస్తామని... కానీ పంట మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయదని స్పష్టం చేశారు. వానాకాలంలో పండిన పంటను ప్రతీ గింజ కొనుగోలు చేస్తామని చెప్పారు. యాసంగి ధాన్యం కొనుగోలుపై కేసీఆర్ చేసిన ప్రకటనతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వరి పండించే పొలంలో ఇతర పంటలు వేయడం సాధ్యం కాదని... యాసంగి ధాన్యం కొనుగోలు చేయమంటే తమ పరిస్థితేంటని వాపోతున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook