Police Officials Misuse Powers: తెలంగాణలో అతి పెద్ద గిరిజన జాతర వైభవంగ ప్రారంభమైంది.   మన రాష్ట్రం నుంచి మాత్రమే కాకుండా.. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా భక్తులు సమ్మక్క సారాలమ్మలను దర్శించుకోవడానికి భారీగా తరలివస్తున్నారు. ఇప్పటికే మేడారం అంతా భక్తులతో కిటకిట లాడుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Samantha: సమంత ఫిట్‌నెస్ ఫ్రీక్.. ఓ రేంజ్‌లో ఉందిగా..


ఎక్కడ చూసి అమ్మవారి కోసం భారీగా క్యూలైన్లలో  భక్తులు, భారీగా నిలువెత్తు బంగారం సమర్పించుకుంటున్న భక్తులు కన్పిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా మేడారం వస్తున్న భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది. క్యూలైన్లలో పోలీసులను, ప్రత్యేకంగా సిబ్బందిని నియమించింది. తాగు నీరు, ఆహారం, వెహికిల్స్ కు పార్కింగ్ వంటి  ఇతర ఏర్పాట్లను చేసింది.


ఇదిలా ఉండగా.. కొందరు పోలీసులు తమకు కేటాయించి ప్రదేశంలో విధులు నిర్వర్తించకుండా అతిగా ప్రవర్తిస్తున్నారు. తమకు తెలిసిన వాళ్లను, కుటుంబాలను నేరుగా అమ్మవారి గద్దెల వరకు తీసుకెళ్తున్నారు. అంతటితో ఆగకుండా వీరికి వీఐపీ సదుపాయాలు కల్పిస్తున్నారు.


Read More: Jaggery: ఖాళీ పొట్టతో ఉదయాన్నే బెల్లం తింటే ఎన్ని ప్రయోజనాలో మీకు తెలుసా..?


దీంతో అమ్మవారిని చూడాలని క్యూలైన్లలో ఉంటున్న భక్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము కూడా మనుషులమేనని.. అధికారం దుర్వినియోగం చేసుకుని ఇలా పోలీసులు అతిగా ప్రవర్తించకూడదంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు.  కొందరు భక్తులు పోలీసులతో వాగ్వాదానికి కూడా దిగుతున్నారు. వెంటనే దీనిపై ఆలయ అధికారులు చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర వివాదస్పదంగా మారింది. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook