Munugode Bypoll:  తెలంగాణలో అన్ని ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు ఉప ఎన్నికలో ప్రచారం తారా స్థాయికి చేరింది. బైపోల్ లో ఎలాగైనా గెలవాలని శ్రమిస్తున్న అధికార టీఆర్ఎస్ పార్టీలో కలవరం నెలకొంది. ఈ విషయంలో హైకోర్టును ఆశ్రయించింది. ఆదివారం హైకోర్టులో హౌజ్‌ మోషన్‌ పిటిషన్ వేసింది. అయితే న్యాయమూర్తి ఇంట్లో అత్యవసర విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిరాకరించారు. దీంతో హైకోర్టులో సోమవారం లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ వేయనుంది టీఆర్ఎస్. మునుగోడులో టీఆర్ఎస్ ను అంతగా కలవరపెడుతుందో ఎంటో తెలుసా.. సింబల్. గుర్తు విషయంలోనే న్యాయపోరాటానికి దిగింది కారు పార్టీ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మునుగోడు ఉప ఎన్నికలో కారును పోలిన ఎనిమిది గుర్తులను తొలగించాలని హైకోర్టులో అధికార పార్టీ పిటిషన్ వేసింది. ఎన్నికల కమిషన్ సింబల్స్ జాబితాలో  కెమెరా, చపాతీ రోలర్, డోలీ, రోడ్ రోలర్, సబ్బు డబ్బా, టీవీ, కుట్టు మిషన్, ఓడ గుర్తులు ఉన్నాయి. అయితే కారును పోలి ఉన్న ఈ గుర్తులతో తమకు నష్టం జరుగుతుందని టీఆర్ఎస్ భయపడుతోంది. గుర్తుల జాబితా నుంచి ఈ ఎనిమిది సింబల్స్ ను తొలగించాలని ఈనెల 10న ఎన్నికల సంఘాన్ని కలిసి విజ్ఞప్తి చేసింది.  ఎన్నికల్లో కారును పోలిన గుర్తులను అభ్యర్థులకు ఇవ్వడం వల్ల ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారని.. తమ అభ్యర్థులు స్వల్ప తేడాతో ఓడిపోయారని తెలిపింది. మునుగోడు ఉప ఎన్నికలో ఈ సింబల్స్ ను ఎవరికి కేటయించవద్దని సీఈవోని కోరారు గులాబీ నేతలు. అయితే సింబల్స్ విషయంలో ఈసీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది. మునుగోడులో నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం మధ్యాహ్యంతో ముగియనుంది. ఆ తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థులకు ఎన్నికల సంఘం సింబల్స్ కేటాయిస్తుంది.


2018 ఎన్నికల్లో తమకు సింబల్ తో నష్టం జరిగిందని టీఆర్ఎస్ చెబుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులకన్నా.. స్వతంత్ర అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. ప్రధాన పార్టీల సింబల్ పోలిన గుర్తు రావడం వలనే వారికి భారీగా ఓట్లు వచ్చాయన్న వాదన ఉంది.  మునుగోడు, జహీరాబాద్‌, సిర్పూర్‌, డోర్నకల్‌లో రోడ్‌రోలర్‌ గుర్తుకు సీపీఎం, బీఎస్పీ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి. నర్సంపేట, చెన్నూరు, దుబ్బాక, సిద్దిపేట, ఆసిఫాబాద్, బాన్సువాడ, నాగార్జునసాగర్ లో కెమెరా గుర్తుకు అలాగే జరిగింది. 2020లో హోరాహోరీగా సాగిన దుబ్బాక ఉపఎన్నికలోనూ కారుకు రోటీ మేకర్ దెబ్బ కొట్టింది.దుబ్బాకలో రోటీ మేకర్ గుర్తు వచ్చన బండారు నాగరాజుకు 3500 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి.. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు చేతిలో 1470 ఓట్ల తేడాతో ఓడిపోయారు. రోటిమేకర్ గుర్తు లేకుంటే ఆ 3 వేల 5 వందల ఓట్లు కారుకే పడేవని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలోను ప్రజాఏక్తా పార్టీ అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్‌ కు రోటీ మేకర్ సింబల్ వచ్చింది. ఉప ఎన్నికలో ఆయనకు 1918 ఓట్లు వచ్చాయి.అందుకే ఈ ఎనిమిది గుర్తులను తొలగించాలని టీఆర్ఎసి కోరుతోంది.


మరోవైపు మునుగోడు ఉప ఎన్నికలో నామినేషన్ల  పరిశీలన తర్వాత  14 జిల్లాలకు చెందిన 83 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఆదివారం 10 మంది నామినేషన్ ఉపసంహరించుకున్నారు.చివరి రోజు సోమవారం ఎంతమంది బరి నుంచి తప్పుకుంటారన్నది ఆసక్తిగా మారింది.


Read Also: Nikesha Patel-Pawan Kalyan : నీ వెంట నడుస్తా.. కొమురం పులి హీరోయిన్ ట్వీట్ వైరల్


Read Also: Munugode Bypoll: మునుగోడు స్పెషల్.. డబ్బుల కోసం మంత్రి మల్లారెడ్డిని నిలదీసిన ఓటర్లు



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook