Munugode Bypolls, BJP Meeting: మునుగోడులో ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపిలు పోటాపోటీగా అక్కడ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా ఈనెల 21న మునుగోడులో బహిరంగ సభ తలపెట్టనున్నట్టు బీజేపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే ప్రకటించారు. మునుగోడు ఉప ఎన్నికను సవాలుగా తీసుకున్న బీజేపి.. అక్కడ తమ అభ్యర్థిని ఎలాగైనా గెలిపించుకునేందుకు సర్వశక్తులొడ్డుతోంది. ఇటీవలే బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కారణంగా వస్తున్న ఉప ఎన్నిక కావడం ఇందుకు ఒక కారణమైతే.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఉప ఎన్నిక కావడం మరో కారణం అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు కోసం నిర్వహిస్తున్న బహిరంగ సభలు కావడంతో తమకు భారీగా ప్రజల మద్దతు ఉందని చెప్పుకునేందుకు అన్ని పార్టీలు శాయశక్తులా కృషి భారీ ఎత్తున జన సమీకరణ చేపడుతున్నాయి. ఇందులో భాగంగానే బీజేపి కూడా అమిత్ షా బహిరంగ సభను భారీ ఎత్తున విజయవంతం చేసే ఏర్పాట్లలో తలమునకలైంది. భారీ ఎత్తున జన సమీకరణ చేపట్టడంతో పాటు అందుకు అవసరమైన అన్ని ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు బండి సంజయ్ ఒక్కో మండలానికి ఇద్దరు సీనియర్ నేతలను ఇంఛార్జీలుగా నియమించారు. 


మునుగోడు నియోజకవర్గంలో కొత్తగా ఏర్పాటైన గట్టుప్పల్ మండలం సహా మొత్తం 9 మండలాలు ఉన్నాయి. 9 మండలాలకుగాను మొత్తం 18 మంది సీనియర్ నాయకులను నియమించి వారికే జన సమీకరణతో పాటు పలు ఇతర బాధ్యతలను అప్పజెప్పారు. 


మునుగోడు మండలానికి బీజేపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి.. చౌటుప్పల్ రూరల్ మండలానికి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చౌటుప్పల్ మున్సిపాలిటీకి బీజేపి జాతీయ కార్యవర్గ సభ్యులు గరికపాటి మోహన్ రావు, ఏనుగు రవీందర్ రెడ్డి, చండూరు మున్సిపాలిటీ : పార్టీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్, మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి, చండూరు మండలంకు మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణను ఇంచార్జులుగా నియమించారు. అలాగే కొత్తగా ఏర్పాటైన  గట్టుప్పల్ మండలం బాధ్యతలు పర్యవేక్షించడానికి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, మర్రిగూడెం మండలం బాధ్యతలను మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు టి.ఆచారి, నాంపల్లి మండలం బాధ్యతలను మాజీ మంత్రి డాక్టర్ ఏ.చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే ధర్మారావులకు అప్పగించారు.


Also Read : Munugode ByPoll Live Updates: కోమటిరెడ్డితో పాటు బీజేపీలోకి మరో సీనియర్ నేత.. కాంగ్రెస్‌లో పరేషాన్


Also Read : Constable Recruitment: తెలంగాణలో కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్..ఇలా హాల్‌ టికెట్లు పొందండి..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://bit.ly/3P2DgvH


Apple Link - https://apple.co/3df6gDq


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook