Munugode Shooting: నల్గొండ జిల్లా మునుగోడులో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఓ యువకుడిపై గురువారం (ఆగస్టు 5) రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గన్‌తో కాల్పులు జరిపారు. ఆపై అక్కడి నుంచి బైక్‌పై పరారయ్యారు. కాల్పుల్లో గాయపడ్డ బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని స్వగ్రామం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వగ్రామమైన బ్రాహ్మణ వెల్లెంల కావడం గమనార్హం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిమ్మల లింగుస్వామి (32) అనే వ్యక్తి మునుగోడు మండల కేంద్రంలో కూల్‌డ్రింక్స్, వాటర్ బాటిళ్లు విక్రయించే షాపు నిర్వహిస్తున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నాడు. స్వగ్రామమైన బ్రాహ్మణ వెల్లెంలలో నివసిస్తున్న లింగుస్వామి రోజూ మునుగోడు వెళ్లి వస్తుంటాడు. ఎప్పటిలాగే గురువారం రాత్రి షాపు మూసిన తర్వాత బైక్‌పై ఇంటికి బయలుదేరాడు.


ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై లింగుస్వామిని వెంబడించారు. సింగారం గ్రామ శివారు దాటాక లింగుస్వామిని అడ్డగించి గన్‌తో అతనిపై కాల్పులు జరిపారు. దీంతో అతను కుప్పకూలిపోయాడు. లింగుస్వామి చనిపోయినట్లు భావించిన దుండగులు అక్కడినుంచి పరారయ్యారు. ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. 


లింగుస్వామి అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించి వెంటనే నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలంలో పోలీసులు బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. రియల్ ఎస్టేట్ తగాదాలే దాడికి కారణమని అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.  కాగా, బాధితుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వగ్రామం బ్రాహ్మణ వెల్లెంలకు చెందినవాడు కావడం చర్చనీయాంశంగా మారింది.


Also Read: Bimbisara Twitter Review: కల్యాణ్ రామ్ 'బింబిసార' ట్విట్టర్ రివ్యూ.. సినిమా ప్రేక్షకులను మెప్పించిందా..


Also Read: Varalakshmi Vratam 2022: ఇవాళ వరలక్ష్మీ వ్రతం.. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు, పుష్పాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook