Muralidhar Rao: త్వరలో టీఆర్ఎస్‌లో భూకంపం రాబోతోందన్నారు బీజేపీ సీనియర్ నేత మురళీధర్‌రావు. ఆ పార్టీలో అసమ్మతి తీవ్ర స్థాయిలో ఉందని..త్వరలో బ్లాస్ట్‌ కానుందని జోస్యం చెప్పారు. తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేంద్ర ప్రభుత్వం వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం అన్న చదంగా చూపుతున్నారని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ సర్కార్‌పై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ యుద్దంలో కేసీఆర్‌కు ఓటమి తప్పదన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. అవినీతి బయట పడుతుందనే కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌కు భయపడే పరిస్థితి లేదన్నారు బీజేపీ సీనియర్ నేత మురళీధర్‌రావు. సిద్దిపేటలో ప్రజా గోస..బీజేపీ భరోసా కార్యక్రమంలో పాల్గొన్నానని..అక్కడే టీఆర్ఎస్‌పై వ్యతిరేకత కనిపించిందన్నారు. ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారని గుర్తు చేశారు.


సిద్ధిపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్‌కు ఓటమి తప్పదని స్పష్టం చేశారు. దేశంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు ఆమోఘంగా ఉన్నాయని చెప్పారు. విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోతున్నా..దేశం ఆర్థిక సంక్షోభం వైపు వెళ్లడం లేదని బీజేపీ సీనియర్ నేత మురళీధర్‌రావు తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ, డాలర్‌తో రూపాయి పతనం వంటి అంశాలపై సీఎం కేసీఆర్ చర్చకు రావాలని పిలుపునిచ్చారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాయంలో మీడియాతో మాట్లాడారు. 


నీతి ఆయోగ్ నిరర్ధకమని సీఎం కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు బీజేపీ సీనియర్ నేత మురళీధర్‌రావు. బీజేపీయేతర సీఎంలు హాజరయ్యారని గుర్తు చేశారు. ఇందులో కీలక అంశాలపై చర్చించారని గుర్తు చేశారు. కేసీఆర్, కేటీఆర్‌లకు ఆర్థిక శాస్త్రం గురించి తెలియదని..బీఎస్‌ఎన్‌ఎల్, ఎల్‌ఐసీ విక్రయిస్తున్నారని అసత్య ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 8 ఏళ్లలో బ్యాంకులకు చెల్లించాల్సిన మొండి బకాయిలను కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిందని తెలిపారు. 


మొత్తంగా మునుగోడు ఉప ఎన్నిక త్వరలో జరగనుండటంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. టీఆర్ఎస్, బీజేపీ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆమోదించారు. త్వరలో నోటిఫికేషన్‌ రానున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌, నవంబర్‌ నెలల్లో హిమాచల్ ప్రదేశ్‌తోపాటు మరికొన్ని నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలో మునుగోడు ఎన్నిక నగారా మోగనుంది.


Also read:PM Modi and Pak Sister: ప్రధాని మోదీకు 25 ఏళ్లుగా రాఖీ కడుతున్న పాకిస్తాన్ చెల్లెలు.


Also read:Sanjay Raut: శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు షాక్..మరోసారి జ్యుడిషియల్ కస్టడీ..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook