Mutyalamma Temple: మతపిచ్చి ఉన్మాదుల అంతం చూస్తాం.. ముత్యాలమ్మ సాక్షిగా ఈటల శపథం..
Mutyalamma Temple: అమ్మవారి నవరాత్రి ఉత్సవాల తర్వాత సికింద్రాబాద్ లో కొలువైన ముత్యాలమ్మ దేవాలయంపై దాడి ఘటన కలకలం రేపింది. దాడి చేసిన నిందితుడిని పిచ్చోడంటూ పోలీసులు వ్యవహరించిన తీరును ప్రజలు తప్పు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ముత్యాలమ్మ గుడి ధ్వంసం నేపథ్యంలో బీజేపీ నేత ఈటల రాజేందర్ రెడ్డి ముత్యాలమ్మ గుడిని సందర్శించారు.
Mutyalamma Temple: సికింద్రాబాద్ పాస్ పోర్ట్ ఆఫీసు సమీపంలోని కుర్మగూడలో ముత్యాలమ్మ గుడిలో అమ్మవారి విగ్రహ ధ్వంసం ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. స్థానికంగా అక్కడ కొలువై ఉండే అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన పై పోలీసులు దర్యాప్తు చేపట్టి.. నిందితుడిని పట్టుకున్నారు. అయితే దాడికి పాల్పడిన వ్యక్తి కి మత స్థిమితం లేదని పోలీసులు తెలిపారు. దీంతో కొంత మంది హిందూ నాయకులు .. మత స్థిమితం లేని వాళ్లకు కేవలం హిందూ దేవతా విగ్రహాలు మాత్రమే దొరుకుతాయా.. ? వేరే విగ్రహాలు ఏవి కనపడవా అని నిలదీస్తున్నారు. దాడికి పాల్పడిన నిందితుడు ముస్లిమ్ సామాజిక వర్గానికి చెందిన సలీమ్ వ్యక్తి కావడంతో ఓటు బ్యాంక్ రాజకీయల కోసమే తెలంగాణ ప్రభుత్వం అతడిని రక్షించే ప్రయత్నం చేస్తుందని బీజేపీ సహా హిందూ సంస్థలు ఆరోపణలు చేస్తున్నాయి.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువైనప్పటి నుంచి హిందూ దేవాలయాలపై.. హిందూ దేవీ దేవతా విగ్రహాలపై ఒక పథకం ప్రకారం దాడులకు పాల్పడే కుట్రకు తెర తీసారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. కేవలం ఒక మతానికి చెందిన విగ్రహాలను టార్గెట్ చేయడం వెనక పెద్ద కుట్ర ఉందని చెబుతున్నారు. ముత్యాలమ్మ గుడి ధ్వంసం ఘటనలో కేవలం బీజేపీకి చెందిన నేతలు మాత్రమే మాట్లాడుతున్నారు. అటు అధికారంలోకి ఉన్న కాంగ్రెస్ పార్టీకానీ.. బీఆర్ఎస్ నాయకుల్లో కేవలం తలసాని మాత్రమే ఈ ఇష్యూపై స్పందించారు. మిగిలిన వారు ఎవరు ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ధ్వంసాన్ని ఖండించలేదు.
తాజాగా మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్.. తెలంగాణలో కొలువైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హిందూ దేవాలయాల మీద కుట్ర ప్రకారమే దాడి జరుగుతోందన్నారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయాన్ని సందర్శించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ చట్టంలో మార్పులు తెస్తామని చెప్పిన తరవాత, ముస్లిమ్ సామాజికి వర్గానికి చెందిన యువకుల్లో విషం నింపుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించకపోతే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కావల్సివస్తుందని తెలిపారు. చిల్లర రాజకీయాల చేస్తే జరిగే పరిణామాలను ఊహించలేరని హెచ్చరించారు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. అంతేకాదు మతపిచ్చి ఉన్మాదుల అంతం చూస్తామని ముత్యాలమ్మ సాక్షిగా ఈటల శపథం చేసారు.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.