Asaduddin Owaisi: దేశంలో అత్యంత ఆసక్తికరంగా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దేశం దృష్టిని ఆకర్షిస్తున్న ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై ఆసక్తికరంగా మారాయి. ఈ ఎన్నికలపై తెలంగాణలోనూ విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించగా.. తాజాగా ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ స్పందించారు. ఏపీ ఎన్నికల్లో ఆయన ఒకరికి మద్దతు ప్రకటించారు. అంతేకాకుండా గెలిచేదెవరో కూడా జోష్యం చెప్పారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Glass Symbol: ఏపీ ఎన్నికల్లో కూటమికి భారీ షాక్‌.. గాజు గ్లాస్‌ ఇతరులకు కేటాయింపు


 


హైదరాబాద్‌ ఎంపీగా పోటీ చేస్తున్న అసదుద్దీన్‌ ఒవైసీ ఓ మీడియా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. జాతీయ రాజకీయాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలపై అసదుద్దీన్‌ స్పందించారు. 'ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోనే వైఎస్సార్‌సీపీకి ప్రజలు మద్దతు ఇవ్వాలి' అని ఏపీ ఓటర్లకు అసద్‌ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. 'రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల హక్కులను కాపాడేందుకు కృషి చేస్తున్న అత్యంత సెక్యులర్‌ నాయకుడు జగన్‌' అని తెలిపారు.

Also Read: YS Jagan Convoy: కాన్వాయ్‌ కిందపడ్డ కుక్క.. చలించిపోయిన సీఎం వైఎస్ జగన్‌ 


 


ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై అసదుద్దీన్‌ తీవ్ర విమర్శలు చేశారు. 'చంద్రబాబు పచ్చి అవకాశవాది, విశ్వసనీయత లేని నాయకుడు. ఏపీలో ఎన్డీయే అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను తొలగించేందుకు వెనుకాడదు. అసద్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీలో ఆసక్తికర చర్చ మొదలైంది. అసదుద్దీన్‌, జగన్‌ మంచి మిత్రులు. వీరిద్దరూ కలిసి చదివారు.


ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో జతకట్టిన బీజేపీ వలన కొంత ఇరకాటం ఏర్పడింది. ముస్లిం రిజర్వేషన్లు రద్దు అంశం కూటమిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీలు విడుదల చేసిన మేనిఫెస్టో సమయంలో బీజేపీ అంటిముట్టనట్టుగా వ్యవహరించింది. ఈ కోణంలోనే జగన్‌కు అసదుద్దీన్‌ మద్దతు ప్రకటించారు. మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేసే పార్టీకి, దానికి మద్దతు ఇచ్చే పార్టీని ఓడించాలని అసదుద్దీన్‌ పరోక్షంగా పిలుపునిచ్చారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter