Nagarjuna Forest: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇప్పటికే విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా దేశ వ్యాప్తంగా ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు మొక్కలు నాటి ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. సంతోష్ కుమార్ చేపట్టిన ఇంతటి మహత్కార్యానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ప్రశంసించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొన్ని నెలల క్రితం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో టాలీవుడ్ అగ్రకథానాయకుడు అక్కినేని నాగార్జున పాల్గొన్నారు. అదే సమయంలో తాను ఓ అడవిని దత్తత తీసుకునేందుకు ముందుకొస్తానని రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ కు మాట ఇచ్చారు. ఈ క్రమంలో ఆ మాటను నేడు (ఫిబ్రవరి 18) నేరవేర్చుకునేందుకు బాటలు వేశారు. 



దాదాపుగా 1,080 ఎకరాల విస్తీర్ణంలోని అడవిని దత్తత తీసుకున్నట్లు నాగార్జున తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. అంతే కాకుండా ఆ అడవిలో మొక్కులు పెంచుతామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా శిలా ఫలకాన్ని ఆవిష్కరించి.. మొక్కలు నాటారు. ఆయనతో పాటు నాగ్ కుమారులు నాగ చైతన్య, అఖిల్ తో పాటు మేనల్లుడు సుశాంత్, అక్కినేని కుటుంబసభ్యులు కూడా మొక్కులు నాటారు.  


ఈ కార్యక్రమంలో ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ తో పాటు అక్కినేని కుటుంబం నుంచి నాగార్జున, నాగ చైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్, నాగ సుశీల నాగార్జునతో పాటు నాగచైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్, నాగ సుశీల.. తదితరులు పాల్గొన్నారు. ఆ దత్తత తీసుకున్న అటవీ ప్రాంతానికి అక్కినేని నాగేశ్వరరావు అర్బన్ ఫారెస్ట్ పార్క్ అనే పేరు పెట్టారు.  


Also Read: Nani Dasara Movie Launched: పట్టాలెక్కిన నాని కొత్త సినిమా 'దసరా'...


Also Read: Bappi Lahiri: అమెరికా నుంచి రావాల్సిన కుమారుడు.. బప్పి లహిరి అంత్యక్రియలు రేపే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook