Bappi Lahiri: అమెరికా నుంచి రావాల్సిన కుమారుడు.. బప్పి లహిరి అంత్యక్రియలు రేపే..

Bappi Lahiri Cremation Tomorrow: బప్పి లహిరి మరణం సంగీత అభిమానులను విషాదంలో ముంచెత్తింది. బప్పి లహిరి కుమారుడు అమెరికా నుంచి రావాల్సి ఉన్నందునా.. అంత్యక్రియలు గురువారం నిర్వహించనున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 16, 2022, 05:03 PM IST
  • రేపు ముంబైలో బప్పి లహిరి అంత్యక్రియలు
  • అమెరికా నుంచి రావాల్సిన కుమారుడు
  • అనారోగ్యంతో కన్నుమూసిన బప్పి లహిరి
 Bappi Lahiri: అమెరికా నుంచి రావాల్సిన కుమారుడు.. బప్పి లహిరి అంత్యక్రియలు రేపే..

Bappi Lahiri Cremation Tomorrow: ప్రముఖ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ బప్పి లహిరి అనారోగ్యంతో ముంబైలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. బప్పి లహిరి అంత్యక్రియలు గురువారం (ఫిబ్రవరి 16) జరగనున్నాయి. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఉన్న బప్పి లహిరి కుమారుడు బప్పా లహిరి రాక కోసం అతని కుటుంబం ఎదురుచూస్తోంది. బప్పా లహిరి ముంబై వచ్చాక హిందూ సాంప్రదాయ పద్దతిలో బప్పి లహిరి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ మేరకు బప్పి లహిరి కుటుంబం ఒక ప్రకటన విడుదల చేసింది.

'ఇది మా కుటుంబానికి తీవ్ర విచారకర సమయం. రేపు అమెరికా లాస్ ఏంజిల్స్ నుంచి బప్పా లహిరి వచ్చాక బప్పి లహిరి దహన సంస్కారాలు జరుగుతాయి. బప్పి లహిరి ఆత్మకు శాంతి చేకూరాలని మేము ప్రార్థిస్తున్నాం. అంత్యక్రియలకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు మీకు అప్‌డేట్ చేస్తాం.' అని ఆ ప్రకటనలో బప్పి లహిరి కుటుంబం పేర్కొంది. 

బప్పి లహిరి కొంతకాలంగా 'అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా'తో పాటు చెస్ట్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు.  29 రోజుల పాటు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొంది రెండు రోజుల క్రితమే డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఇంటికి వెళ్లిన మరుసటి రోజే ఆయన ఆరోగ్యం క్షీణించింది. మంగళవారం (ఫిబ్రవరి 15) రాత్రి 11.30గం. సమయంలో ఆసుపత్రికి తరలించగా.. 11.45గం. సమయంలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 

బప్పి లహిరి మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బాలీవుడ్ హీరోలు అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ పలువురు నటీనటులు సంతాపం ప్రకటించారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ తదితర భాషల్లో బప్పి లహిరి ఎన్నో పాటలు పాడారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎన్నో చిత్రాలకు అద్భుతమైన బాణీలు అందించారు. ముఖ్యంగా 1980, 1990ల్లో బప్పి లహిరి హవా కొనసాగింది. డిస్కో డ్యాన్సర్, నమక్ హలాల్, డిస్కో డ్యాన్స్, కమాండో తదితర చిత్రాలకు బప్పి అందించిన మ్యూజిక్‌తో ఆయనకు 'డిస్కో కింగ్' అనే బిరుదు కూడా వచ్చింది. లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మరణం నుంచి ఇంకా తేరుకోక ముందే బప్పి లహిరి మరణించడం సంగీత అభిమానులను విషాదంలో ముంచెత్తింది. 

Also Read: Bigg Boss OTT: బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్స్ లిస్ట్ వైరల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News