Elderly woman cheated in the name of Covid tests: మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని మార్క్స్ మహనీయుడు ఏనాడో చెప్పాడు. ప్రస్తుత సమాజంలో మన చుట్టూ జరుగుతున్న ఎన్నో సంఘటనలు మార్క్స్ చెప్పిన సూత్రీకరణను నిజం చేస్తూనే ఉన్నాయి. నిన్నటికి నిన్న ఆస్తి కోసం కన్నతల్లిని కొడుకే చిత్రహింసలకు గురిచేసిన ఘటన గుంటూరులో వెలుగుచూడగా.. తాజాగా నల్గొండలో ఎల్లమ్మ అనే ఓ వృద్దురాలిని కరోనా టెస్టుల పేరుతో తీసుకెళ్లి ఆమె భూమి రాయించుకున్న ఘటన వెలుగుచూసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నల్గొండ జిల్లా కట్టంగూరు కలిమేరకు చెందిన ఓ 80 ఏళ్ల వృద్దురాలికి ఎకరా 10 గుంటల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిపై కన్నేసిన వీరయ్య అనే వ్యక్తి ఎలాగైనా దాన్ని కాజేయాలనుకున్నాడు. ఇందుకోసం వృద్దురాలిని బోల్తా కొట్టించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. కరోనా టెస్టులు చేయిస్తానని నమ్మించి ఇటీవల ఓరోజు ఆ వృద్దురాలిని ఎమ్మార్వో ఆఫీసుకు తీసుకెళ్లాడు.


అది ఎమ్మార్వో ఆఫీస్ అని తెలియక.. అక్కడేం జరుగుతుందో అర్థం కాక.. వీరయ్య చెప్పినట్లు ఆ వృద్దురాలు సంతకాలు పెట్టింది. అలా వృద్దురాలి పేరిట ఉన్న ఎకరా 10 గుంటల భూమిని వీరయ్య అతని పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఆ తర్వాత అసలు విషయం గ్రహించిన వృద్దురాలు పోలీసులను ఆశ్రయించి వీరయ్యపై ఫిర్యాదు చేసింది. దీంతో వీరయ్యపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


నిన్నటికి నిన్న గుంటూరులో ఆస్తి కోసం ఓ వృద్దురాలిని కన్న కొడుకే చిత్రహింసలకు గురిచేసిన వీడియో వెలుగుచూసిన సంగతి తెలిసిందే. కన్నతల్లి అన్న కనికరం లేకుండా ఆమె తలపై చెంబుతో దాడి చేసిన కొడుకు, కాలితో ఆమె కడుపులో తన్నాడు. నిలబడలేని స్థితిలో ఉన్న ఆమెకు ఆసరాగా నిలవాల్సిందిపోయి అత్యంత కర్కశంగా వ్యవహరించాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో అతన్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.


Also Read: Virat Kohli Break: విరాట్​ కోహ్లీకి బ్రేక్​- వెస్డీడీస్​తో మూడో టీ20కి దూరం..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook