Modi cabinet:ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేబినెట్ లో ఖాళీలు ఉన్నాయి. రాజ్యసభ పదవి కాలం ముగియడంతో ఇంతకాలం కేబినెట్ మంత్రులుగా పని చేసిన ముక్తార్ అబ్బాస్ నక్వీ, ఆర్ సీపీ సింగ్ లు ఇటీవలే పదవులకు రాజీనామా చేసారు. మోడీ మంత్రివర్గంలో ముక్తార్ అబ్బాస్ నక్వీ  మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేయగా.. ఆర్ సీపీ సింగ్ ఉక్కు శాఖ మంత్రిగా పని చేశారు.  ప్రస్తుతం ఆ శాఖలను స్మృతి ఇరానీ, జ్యోతిరాదిత్య సింధియా అదనపు బాధ్యతలుగా అప్పగించారు. ఈ రెండు శాఖలు కీలకమైనవే కాబట్టి త్వరలోనే భర్తీ చేయాలని ప్రధాని మోడీ భావిస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు పని తీరు బాగాలేని కొందరు మంత్రులను తప్పిస్తారనే ప్రచారం సాగుతోంది. రాష్ట్రపతి ఎన్నిక అనంత‌రం కేంద్ర‌ మంత్రివర్గాన్ని విస్తరిస్తారనే టాక్ ఢిల్లీ బీజేపీ వర్గాల నుంచి వస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేబినెట్ విస్తరణలో వచ్చే రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది. గుజరాత్, కర్ణాటకతో పాటు తెలంగాణలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో గుజరాత్, కర్ణాటకలో బీజేపీనే అధికారంలో ఉంది. అయితే ఈసారి కర్ణాటకలో బీజేపీకి కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. దీంతో దక్షిణాదిలో పాగా వేసేందుకు తెలంగాణపై బీజేపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్ చేసింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం సాధించి తీరుతామని బీజేపీ హైకమాండ్ చెబుతోంది. ఇటీవలే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను కూడా హైదరాబాద్ లోనే నిర్వహించింది. పార్టీ అగ్రనేతలంతా రెండు రోజుల పాటు హైదరాబాద్ లోనే ఉన్నారు. తెలంగాణలో అధికారం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కాబట్టే.. ఇక్కడ సమావేశాలు పెట్టారు. దీంతో వచ్చే కేబినెట్ విస్తరణలో తెలంగాణకు చోటు దక్కడం ఖాయమంటున్నారు.


తెలంగాణ నుంచి ప్రస్తుతం సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ఉన్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచారు. కిషన్ రెడ్డితో పాటు కరీంనగర్ లో బండి సంజయ్, నిజామాబాద్ లో ధర్మపురి అర్వింద్, ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావు విజయం సాధించారు. ఇటీవలే తెలంగాణ సీనియర్ నేత లక్ష్మణ్ ను ఉత్తర్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేట్ చేశారు. మోడీ కేబినెట్ విస్తరణలో నలుగురు ఎంపీలు రేసులో ఉన్నారు. బండి సంజయ్ పార్టీ చీఫ్ గా ఉన్నారు. బీజేపీలో ఒకే వ్యక్తికి రెండు పదవులు ఇవ్వరు.  జేపీ నడ్డాను కేబినెట్ ను తప్పించాకే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమించారు. గతంలో అమిత్ షా వ్యవహారంలోనూ ఇలానే జరిగింది. దీంతో బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం ధర్మపురి అర్వింద్, లక్ష్మణ్ లలో ఒకరికి  అవకాశం ఉంటుందని అంటున్నారు.


తెలంగాణలో ప్రస్తుతం కుల సమీకరణలు జోరుగా సాగుతున్నాయి. గత లోక్ సభ ఎన్నికల్లో కాపు సామాజికవర్గం మద్దతుతోనే బీజేపీ నాలుగు సీట్లు గెలిచిందనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలోనే అదే సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ కి పార్టీ పగ్గాలు ఇచ్చారు. ఇటీవల కాలంలోనూ కాపులకు బీజేపీలో ప్రాధాన్యత దక్కుతోంది. సీనియర్ నేత లక్ష్మణ్ కు యూపీ కోటాలో రాజ్యసభ సీటు ఇచ్చారు. త్వరలో జరగనున్న కేంద్ర కేబినెట్ విస్తరణలోనూ కాపు సామాజికవర్గానికి చెందిన అర్వింద్, లక్ష్మణ్ లలో ఒకరికి చోటు దక్కడం ఖాయమని అంటున్నారు. ఇటీవల జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు అద్భుతమైన ఏర్పాటు చేశారని రాష్ట్ర నేతలను అభినందించారు బీజేపీ అగ్రనేతలు. 


Read also: Covid Cases Update:దేశంలో కొవిడ్ కల్లోలం.. భారీగా పెరిగిన మరణాలు.. ప్రమాదకరంగా పాజిటివిటి రేట్


Read also: Rape Case: పరస్పర అంగీకారంతో లైంగిక చర్య తర్వాత పెళ్లికి నిరాకరిస్తే.. అది అత్యాచారం కాదు.. కేరళ హైకోర్టు కీలక తీర్పు..   



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.