Hyderabad Honour Killing: శుక్రవారం రాత్రి జరిగిన నీరజ్ పవార్ దారుణహత్య ఘటనతో బేగంబజార్ లోని షాథీనాథ్ గంజ్ ఉలిక్కిపడింది. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై నీరజ్ పవార్ ను కత్తులతో అతి కిరాకతంగా పొడిచి చంపారు ఐదుగురు దుండగులు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. హత్య ఘటన నుంచి స్థానికులు ఇంకా కోలేకోలేదు. నీరజ్ హత్యకు నిరసనగా ఇవాళ స్థానికులు ఆందోళనకు దిగారు. నీరజ్ పవార్ హత్యకు నిరసనగా బేగంబజార్ వ్యాప్తంగా వ్యాపారులు బంద్ నిర్వహిస్తున్నారు. స్థానికులు ఆందోళనకు దిగడంతో బేగంబజార్ లో ఉద్రిక్తత నెలకొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

షాహినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ ముందు నీరజ్ కంటుంబీకులు, బంధువులు ధర్నాకు దిగారు. నిందితులను ఉరి తీయలంటూ  డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు.నీరబ్ బంధువుల ఆందోళనతో బేగంబజార్ రూట్ లో  రాకపోకలు నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు అక్కడే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.


ఇక  నీరజ్ మర్డర్ కేసులో నిందితులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురు నిందితులను కర్ణాటకలో అదుపులోనికి తీసుకున్నారు. నీరజ్ పవార్ ను హత్య చేసిన దుండగులు.. కర్ణాటక వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ప్రత్యేక బృందాలను కర్ణాటక పంపించారు. నిందుతుల సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ట్రేస్ చేసిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.. హంతకులను అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు.బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో  శుక్రవారం రాత్రి జరిగిన మర్డర్ ఘటన తీవ్ర సంచలనంగా మారింది. అందరూ చూస్తుండగానే నీరజ్ పవార్ ను కత్తులతో పొడిచి చంపారు దుండుగులు. మృతుడి శరీరంపై 20 వరకు కత్తిపోట్లు ఉన్నాయని గుర్తించారు. రెండు బైకులపై వెంటాడి నీరజ్ ను హత్య చేశారు దుండగులు. హత్యలో మొత్తం ఐదుగురు దుండగులు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు.అందరూ చూస్తుండగానే నీరజ్ పై దాడి చేశారు దుండగులు. మృతుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో స్పాట్ లో లభించిన ఆధారాలు, సీసీ టీవీ విజువల్స్ ఆధారంగా దర్యాప్తు చేశారు పోలీసులు.


మాలి సమాజానికి చెందిన నీరజ్ పవార్ .. యాదవ్ సామాజిక వర్గానికి చెందిన  చెందిన సంజన అనే అమ్మాయిని ఏడాదిన్నర క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఇద్దరు రిజిస్టర్ పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు రెండున్నర నెలల పాప కూడా ఉంది. పెళ్లి జరిగినప్పటి నుంచే అమ్మాయి కుటుంబ సభ్యులు నీరజ్ పై కక్ష పెంచుకున్నారని తెలుస్తోంది. కొన్ని రోజులుగా రెక్కీ నిర్వహిస్తున్న దండుగులు.. రద్దీగా ఉండే బేగంబజార్ ఫిష్ మార్కెట్ లో నీరజ్ పవార్ పై కత్తులతో దాడి చేసి చంపేశారు.


READ ALSO: Telangana Police Alert: బైక్ పై వెళ్తున్నారా.. ఇలా చేయండి.. లేదంటే డేంజర్! తెలంగాణ పోలీసుల అలెర్ట్


READ ALSO: PM Modi Hyderabad Tour: హైదరాబాద్ లో ప్రధాని మోడీ రోడ్ షో? భారీగా జనసమీకరణకు బీజేపీ ప్లాన్..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook