PM Modi Hyderabad Tour: హైదరాబాద్ లో ప్రధాని మోడీ రోడ్ షో? భారీగా జనసమీకరణకు బీజేపీ ప్లాన్..

PM Modi Hyderabad Tour: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈనెల 26న హైదరాబాద్ రానున్నారు. అధికార పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. అయితే అధికారక కార్యక్రమానికే ప్రధాని మోడీ వస్తున్నా.. ఆయన పర్యటనను తమకు అనుకూలంగా మలుచుకోవాలని తెలంగాణ బీజేపీ ప్లాన్ చేస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 21, 2022, 09:51 AM IST
  • ఈనెల 26న హైదరాబాద్ కు ప్రధాని మోడీ
  • బేగంపేట నుంచి గచ్చిబౌలి వరకు మోడీ రోడ్ షో!
  • ప్రధాని పర్యటనకు తెలంగాణ బీజేపీ భారీ ఏర్పాటు
PM Modi Hyderabad Tour: హైదరాబాద్ లో ప్రధాని మోడీ రోడ్ షో? భారీగా జనసమీకరణకు బీజేపీ ప్లాన్..

PM Modi Hyderabad Tour: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈనెల 26న హైదరాబాద్ రానున్నారు. అధికార పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. అయితే అధికారక కార్యక్రమానికే ప్రధాని మోడీ వస్తున్నా.. ఆయన పర్యటనను తమకు అనుకూలంగా మలుచుకోవాలని తెలంగాణ బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం భారీగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రధాని మోడీ ఈనెల 26న గచ్చిబౌలి ఐఎస్బీలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. ఆ రోజున ఆయన ఢిల్లీ నుంచి బేగంపేట ఎయిర్ పోర్టులో ల్యాండ్ కానున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో గచ్చిబౌలి వెళ్లనున్నారు. ఇది అధికారిక షెడ్యూల్. అయితే ప్రధాని పర్యటన షెడ్యూల్ లో మార్పులు చేయాలని తెలంగాణ బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.

బేగంపేట ఎయిర్ పోర్టులో 40 వేల మందితో ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. బేగంపేట నుంచి గచ్చిబౌలి ఐఎస్భీ వరకు హెలికాప్టర్ లో కాకుండా ప్రధాని మోడీ రోడ్ షో నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం పీఎంవోకు నివేదించినట్లు తెలుస్తోంది. ఆ మార్గంలో వేలాది మందితో  ప్రధాని మోడీకి అభివాదం తెలిపేలా ఏర్పాట్లు చేయాలని తెలంగాణ కమలం నేతలు ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. అయితే పీఎంవో నుంచి రోడ్ షోకు ఇంకా సమచారం రాలేదు. ఢిల్లీ నుంచి అధికారం సమాచారం లేకున్నా.. ప్రధాని పర్యటన ఏర్పాట్లలో స్పీడ్ పెంచింది బీజేపీ. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశం జరుపుతున్నారు. ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు జనసమీకరణ చేయాలని నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. గ్రేటర్ పరిధిలోని ప్రతి డివిజన్ నుంచి జనాన్ని తరలించాలని ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి బేగంపేట ఎయిర్ పోర్టులు కార్యకర్తలు తీసుకొచ్చేలా గ్రేటర్ నేతలకు టార్గెట్ పెట్టారట బండి సంజయ్.

తెలంగాణలో ప్రస్తుతం హాట్ హాట్ రాజకీయాలు సాగుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మే6న వరంగల్ సభలో పాల్గొన్నారు. తర్వాత రోజు హైదరాబాద్ లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. బండి సంజయ్ పాదయాత్రలో భాగంగా మే5న పాలమూరులో జరిగిన సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చారు. సంజయ్ ముగింపు సభలో కేంద్రమంత్రి అమిత్ షా హాజరయ్యారు. నడ్డా, అమిత్ షా సభలతో పార్టీకి బూస్ట్ వచ్చిందని తెలంగాణ బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఆ జోష్ ను కంటిన్యూ చేసేలా ప్రధాని మోడీ టూర్ ను ఉపయోగించుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ కొన్ని రోజులుగా దూకుడు పెంచింది. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. దీంతో కాంగ్రెస్ కన్నా వెనకబడిపోయామనే సంకేతం జనాల్లోకి వెళ్లకుండా ఉండాలని బీజేపీ భావిస్తోంది. అందుకే ప్రధాని మోడీ పర్యటన ద్వారా మరోసారి బల ప్రదర్శన చేయాలని కమలనాధులు చూస్తున్నారని తెలుస్తోంది.

READ ALSO: Hyderabad Honour Killing: బేగంబజార్ హత్య కేసు నిందితులు అరెస్ట్! కర్ణాటకలో పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు..

READ ALSO:Delhi Traffic Police Challan: కారులో హెల్మెట్ ధరించలేదని జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీస్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
 

Trending News