Telangana Police Alert: ఇంటి నుంచి బయటికి వెళ్లిన వ్యక్తి... తిరిగి వచ్చేవరకు కుటుంబ సభ్యులకు టెన్షనే. రోడ్డు ప్రమాదాలు అంతలా భయపెడుతున్నాయి జనాలను. బైక్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బైక్ పై వెళ్లే వ్యక్తుల నిర్లక్ష్యం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. లూజ్ గార్మెంట్స్, బురఖాలు ధరించి మోటార్ సైకిళ్లపై కూర్చోవడం ప్రమాదకరంగా మారుతోంది. ఇటీవలే యాచారంలో ఓ యువతి బురఖా మోటారు సైకిల్ వెనుక చక్రంలో ఇరుక్కోవడంతో కింద పడి మృతి చెందింది. సన అనే డిగ్రీ విద్యార్థిని తన సోదరుడితో కలిసి వెళ్తుండగా మోటారు సైకిల్ వెనుక చక్రంలో ఆమె బురఖా పడింది. దీంతో ఆమె బైక్‌పై నుంచి జారిపడి తలకు బలమైన గాయం కావడంతో చనిపోయింది. ఇలాంటి ఘటనలు ఎక్కువగానే జరుగుతున్నాయి.
లూజ్ దస్తులు ధరించడం వల్ల.. అవి బైక్ చక్రాల్లో ఇరుకున్ని ప్రమాదాలు జరుగుతుండటంతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తయ్యారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. బైక్ వెనక కూర్చునే మహిళల కోసం పలు జాగ్రత్తలు సూచిస్తూ ప్రచారం చేస్తున్నారు. మహిళలు మోటార్ సైకిళ్లపై వెనుక కూర్చున్నప్పుడు వారి దుస్తులతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కండువాలు, చున్నీ, బురఖా, చీరలు వంటి వదులుగా ఉండే బట్టలు బైక్‌ల వెనుక చక్రంలో ఇరుక్కుపోయే ప్రమాదం ఎప్పుడూ ఉంటుందని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.
బైక్ పై వెళుతున్నప్పుడు మన దస్తులు చక్రంలో ఇరుకున్నా మనం గమనించ లేదు.ఇతర వాహనదారులు చూసి చెబితే గాని మనకు తెలియదు. లూజ్ దస్తులతో బైకులపై ప్రయాణించే మహిళలు.. సెలో ఫోన్లలో మాట్లాడుతూ నిర్లక్ష్యంగా ఉంటున్నారని.. దుస్తులు బైక్ చక్రంలో ఇరుకున్నది కూడా గమనించడం లేదని పోలీసులు చెబుతున్నారు. ఇదే రోడ్డు ప్రమాదాలకు కారణమవుతుందనీ సీనియర్ ట్రాఫిక్ పోలీసులు అధికారులు అంటున్నారు. సాధారణంగా మహిళలు రోడ్డుకు ఎడమవైపుకు చూసుకుని ఒకవైపు కూర్చుంటారు. ఇది మంచికి కాదని పోలీసులు సూచిస్తున్నారు. బైక్ పై రెండు వైపులా కూర్చోవడమే సేఫ్ అంటున్నారు. ఏవైనా ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉంటే తప్ప.. డబుల్ సైడెడ్ గా కూర్చునే ప్రయాణం చేయాలని.. అది సౌకర్యవంతంగా మాత్రమే కాకుండా సురక్షితంగా ఉంటుందని చెబుతున్నారు.
రోడ్డు ప్రమాదాలలో మహిళా పిలియన్ రైడర్లు ఒకవైపు కూర్చొని ఉండడం వల్ల కింద పడి తలకు గాయాలు కావడం మనం చూస్తాం.. ఏదైనా బైక్ స్కిడ్ అయినప్పుడు, రైడర్ రెండు వైపులా కూర్చుంటాడు కాబట్టి అతను రోడ్డుకు ఎడమ వైపున పడే అవకాశం ఉంది. అయితే వన్ సైడ్ కూర్చున్న మహిళ.. ప్రమాదం జరగగానే బ్యాలెన్స్ కోల్పోయి రోడ్డుకు కుడి వైపున పడి నేరుగా రోడ్డుపై వెళుతున్న వెనుక వాహనం చక్రం కిందకు వస్తుంది అని ట్రాఫిక్ అధికారి చెప్పారు. లూజ్ దుస్తులతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందును బైకర్లు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. బైక్ పై వెనుక ఉండే మహిళలు... డబుల్ సైడెడ్ గా కూర్చోవాలని సూచిస్తున్నారు.
READ ALSO: Pawan Kalyan: బీజేపీతో పొత్తు లేనట్టేనా! జనసేన గెలిచే సీట్లు ఇవేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook