జాతీయ స్థాయి నీట్‌లో తెలంగాణ ర్యాంకుల వివరాలు ఇవే
NEET Telangana Ranks 2021: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ తెలంగాణ ర్యాంకులు విడుదలయ్యాయి. జాతీయ స్థాయి నీట్ పరీక్షలో రాష్ట్ర ర్యాంకుల్ని కాళోజీ విశ్వవిద్యాలయం వెల్లడించింది.
NEET Telangana Ranks 2021: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ తెలంగాణ ర్యాంకులు విడుదలయ్యాయి. జాతీయ స్థాయి నీట్ పరీక్షలో రాష్ట్ర ర్యాంకుల్ని కాళోజీ విశ్వవిద్యాలయం వెల్లడించింది.
దేశవ్యాప్తంగా వైద్య కోర్సుల్లో ప్రవేశానికై జరిగిన జాతీయ స్థాయి పరీక్ష నీట్‌లో(NEET 2021) తెలంగాణ రాష్ట్ర విద్యార్ధుల ర్యాంకులు విడుదలయ్యాయి. కాళోజీ హెల్త్ యూనివర్శిటీ ఈ ర్యాంకుల్ని విడుదల చేసింది. నీట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధుల సొంత రాష్ట్రం ఆధారంగా ర్యాంకులు వెల్లడయ్యాయి. అంటే జాతీయ స్థాయి నీట్ పరీక్షలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్ధుల ర్యాంకుల్ని ప్రత్యేకం చేసి వెల్లడించారు. రాష్ట్రంలోని నీట్ ర్యాంకుల్లో తొలి పది స్థానాల్లో అమ్మాయిలు, అబ్బాయిలు చెరోసగం ఉండటం విశేషం. అయితే కాళోజీ హెల్త్ యూనివర్సిటీ (Kaloji Health University)విడుదల చేసిన ర్యాంకుల వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే. రాష్ట్రంలో ఎంతమందికి ర్యాంకులొచ్చాయనేది తెలుసుకునేందుకు మాత్రమే. కౌన్సిలింగ్‌లో పాల్గొనే అభ్యర్ధుల వివరాలు మాత్రం యూనివర్శిటీలకు దరఖాస్తు చేసుకున్న తరువాత మరో మెరిట్ జాబితా విడుదల కానుంది. అభ్యర్దుల దరఖాస్తుల ఆధారంగా ధృవపత్రాల పరిశీలన తరువాత మెరిట్ జాబితా విడుదలవడం, కౌన్సిలింగ్ జరగడం ఉంటుంది.
రాష్ట్రంలో తొలి పది ర్యాంకుల్లో అబ్బాయిలు , అమ్మాయిలు చెరోసగం ఉండగా..తొలి 100 ర్యాంకుల్లో 55 మంది అబ్బాయిలు, 45 మంది అమ్మాయిలున్నారు. ఇక జాతీయ స్థాయిలో వచ్చిన తొలి 100 ర్యాంకుల్లో 1, 16, 37, 42, 59, 72, 74, 79, 90, 99 ర్యాంకులు తెలంగాణ రాష్ట్రానికి చెందినవే కావడం విశేషం. జాతీయ స్థాయిలో 2 వేల 486వ ర్యాంకు పొందిన విద్యార్ధి తెలంగాణ రాష్ట్రంలో(Telangana)100వ స్థానంలో నిలిచాడు. రాష్ట్ర స్థాయిలో తొలి 9 ర్యాంకుల్ని జనరల్ కేటగరీ విద్యార్ధులకు దక్కాయి. రాష్ట్రంలో ర్యాంకర్ల వివరాలు ఇలా...
1. మృణాల్ కుట్టేరి 2. ఖండపల్లి శశాంక్, 3. కాసా లహరి, 4. ఈమని శ్రీనిజ, 5. దాసిక శ్రీనిహారిక 6. పసుపునూరి శరణ్య 7. బొల్లినేని విశ్వాస్ రావు, 8. కన్నెకంటి లాస్య చౌదరి 9 గజ్జల సమైహనరెడ్డి 10. గాండ్ల ప్రమోద్ కుమార్
Also read: రంగారెడ్డి జిల్లాలో నాలుగేళ్ల బాలుడిని కిరాతకంగా చంపిన బాబాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook