Rythu Bandhu: రైతుబంధు కేవలం 5 ఎకరాల వరకేనా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది?
Rythu Bandhu Limitation: రైతు బంధు విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం చెట్టు, పుట్టలు ఉన్న భూములకు కూడా రైతు బంధు ఇచ్చింది.
Rythu Bandhu Limitation: రైతు బంధు విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం చెట్టు, పుట్టలు ఉన్న భూములకు కూడా రైతు బంధు ఇచ్చింది. దీనిపై తీవ్ర విమర్శలు సీఎం రేవంత్ రెడ్డి చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు రైతుబంధ పథకం కూడా ఇకపై కేవలం 5 ఎకరాలు ఉన్న భూస్వాములకే ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటోందట. దీనికి తగిన విధివిధానాలను ఎలా అమలు చేయాలో ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
ప్రస్తుతం లోక్ సభ ఎన్నికలు సమీపిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, ఒక్కో పథకం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఆ తర్వాత రాజీవ్ ఆరోగ్య శ్రీ ని రూ.10 లక్షలకు పెంచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఉచిత కరెంటు, రూ.500 పథకాన్ని కూడా ప్రారంభించింది.
ఇదీ చదవండి: మందుబాబులకు వెరీ బ్యాడ్ న్యూస్.. వైన్స్, బార్లు, పబ్‌లు బంద్
ఈనేపథ్యంలో ఎన్నో రోజులుగా రైతు బంధు గురించి ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఐదు ఎకరాలు భూములు ఉన్నవారికి రైతు బంధు దశలవారీగా జమ చేశారు. ప్రస్తతం ఎన్నికల కోడ్ నేపథ్యంలో రైతు బంధు గురించి ఏ వివరాలను విడుతల చేయలేదు. అయితే, సీజన్ చివరిలోనే రైతు బంధు పథకం గురించి కొత్త విధివిధానాలను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కానీ, ఇప్పటికే ఉన్న వివరాల ప్రకారం కేవలం పంట పండించే భూములకు మాత్రమే రైతుబంధు అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: ఆదివారం కూలీగా బిల్డప్.. ఏసీబీకి చిక్కిన మహిళా ఆణిముత్యం సబ్ రిజిస్ట్రార్ తస్లీమా
అంటే చెట్లు, పుట్టలు పెరిగిన భుములకు కాకుండా కేవలం సాగు చేస్తున్న భూములకే రైతు బంధు ఇవ్వనున్నట్లు విధివిధానాలు తయారు చేస్తున్నారట. ఇది వరకు ఉన్న ప్రభుత్వం రైతు బంధు పథకం కింద నిధులను నిరుపయోగం చేసినట్లు రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలె రైతు భరోసా కూడా ఐదెకరాలు ఉన్న వారికే అమలు చేయనున్నట్లు చెప్పింది. అంతేకాదు, కేవలం అర్హులైన పేదలకు మాత్రం కచ్చితంగా తమ పథకాలు అందుతాయని సీఎం రేవంత్ రెడ్డి గతంలో చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి