Minister Harish Rao: తెలంగాణలో రానున్న రెండు నెలల్లో అర్హులైన వారికి కొత్త పెన్షన్లు, రేషన్‌ కార్డులు అందిస్తామని మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. ఈసందర్భంగా బీజేపీపై నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రభుత్వం సంపద పెంచి పేదలకు పంచుతుంటే..బీజేపీ ప్రభుత్వం పేదల నుంచి దోచుకుని కార్పొరేట్లకు పంచుతోందని మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా గోదావరికి వరదలు సంభవించాయని..ఐనా ఎలాంటి ప్రాణ నష్టం కల్గకుండా చూశామన్నారు మంత్రి హరీష్‌రావు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వరదలపై బీజేపీ నేతలు హైదరాబాద్‌లో ఉండి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఇవాళ సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇరుగుపల్లిలో బస్తీ దవాఖానను ప్రారంభించారు. అనంతరం సంగారెడ్డిలో మంచినీటి వాటర్ ట్యాంక్‌కు ప్రారంభోత్సవం చేశారు. ఆ తర్వాత జిల్లా ప్రభుత్వాస్పత్రిలో మొక్కలు నాటారు. డ్వాక్రా మహిళలకు చెక్కులను పంపిణీ చేశారు. త్వరలో రూ.50 కోట్లతో మురికి కాల్వలు, సీసీ రోడ్ల నిర్మాణాలు, రూ.15 కోట్లతో మంచి నీటి సరఫరా అందిస్తామన్నారు. 


Also read:Shiv Sena: శివసేనలో తీవ్రమవుతున్న ముసలం..తిరుగుబాటు జెండా ఎత్తిన ఎంపీలు..!


Also read:Mining Mafia: హర్యానాలో రెచ్చిపోయిన మైనింగ్ మాఫియా..అడ్డొచ్చిన పోలీస్‌పై దాడి, హత్య..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook