Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు అలర్ట్.. ఆ ప్రచారంలో నిజం లేదు.. ఇవాళ యథావిధిగా మెట్రో సర్వీసులు
Hyderabad Metro Services: ప్రధాని పర్యటన వేళ హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు మెట్రో సర్వీసులు బంద్ అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని మెట్రో ఎండీ ఖండించారు.
Hyderabad Metro Services: హైదరాబాద్‌లో ఆదివారం (జూలై 3) మెట్రో రైళ్లు యథావిధిగా నడుస్తాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. రోజూ లాగే మూడు కారిడార్లలో మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. రెండు రోజుల పాటు మెట్రో సర్వీసులు బంద్ అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ప్రయాణికులు ఆ ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు.ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన వేళ భద్రతా కారణాలతో రెండు రోజుల పాటు మెట్రో రైలు సేవలను నిలిపివేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మెట్రో ఎండీ దీనిపై స్పందించి స్పష్టతనిచ్చారు.
మెట్రోలో రద్దీ పెరిగే ఛాన్స్..
హైదరాబాద్‌లో ఇవాళ బీజేపీ విజయ సంకల్ప సభ జరగనుంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే ఈ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. సాయంత్రం 6.30 గం. నుంచి 7.30 గం. వరకు మోదీ సభలో ఉంటారు. సభకు సుమారు 10 లక్షల మందిని తరలిస్తున్నట్లు బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. సభ నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్ మార్గంతో పాటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.
ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో మెట్రోకి ప్రయాణికుల తాకిడి పెరిగే అవకాశం ఉంది. పరేడ్ గ్రౌండ్స్‌కు సమీపంలోనే జేబీఎస్, ప్యారడైజ్ మెట్రో స్టేషన్లు ఉండటంతో సభకు వెళ్లేవారు కూడా మెట్రోలో ప్రయాణించే అవకాశం ఉంది. దీంతో మెట్రో రద్దీ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read: Samantha Ruth Prabhu: దాంపత్య జీవితం గురించి ఓపెనయిన సమంత… అంతా కరణ్ జోహారే చేశాడట!
Also Read: Bhagyalaxmi Temple: చార్మీనార్ భాగ్యలక్ష్మి ఆమ్మవారికి యూపీ సీఎం యోగీ పూజలు.. పాతబస్తీలో హైఅలర్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.