Bhagyalaxmi Temple : హైదరాబాద్ పాతబస్తీలో హై టెన్షన్ నెలకొంది. చార్మీనార్ తో పాటు పాతబస్తీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో వందలాది మంది పోలీసులు పహారా కాస్తున్నారు. కేంద్ర బలగాలను రంగంలోకి దింపారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చిన బీజేపీ నేతలు.. చార్మీనార్ దగ్గరున్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శిస్తున్నారు. శుక్ర, శనివారాల్లో పలువురు బీజేపీ ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఇవాళ భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. యూపీ సీఎం యోగీ వెంట తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్ భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చారు .
యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ రాకతో పాతబస్తీలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. వందలాది మంది రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలు చార్మీనార్ దగ్గర పహారా కాశాయి. దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన పరిణామాలతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. నిజానికి యోగీ ఆథిత్యనాథ్ శనివారమే చార్మీనార్ భాగ్యలక్ష్మి ఆలయానికి వస్తారని ప్రచారం జరిగింది. యోగీ వస్తారంటూ పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. కాని చివరి నిమిషంలో యోగీ పర్యటన రద్దైంది. సెక్యూరిటీ క్లియరెన్స్ రాకపోవడంతోనే శనివారం యోగీ భాగ్యలక్ష్మి ఆలయ సందర్శన వాయిదా పడిందని తెలుస్తోంది. పాతబస్తీకి వెళ్లేందుకు సీఎం యోగికి శనివారం సాయంత్రం సెక్యూరిటీ క్లియరెన్స్ వచ్చింది. దీంతో ఇవాళ ఉదయం ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్.
Read also: BJP MEETING: 10 లక్షల మందితో బీజేపీ బహిరంగ సభ.. ప్రధాని మోడీ ప్రసంగంపైనే ఉత్కంఠ!
Read also: Dakshin Superfast Train: దక్షిణ్ సూపర్‌ఫాస్ట్ రైల్లో మంటలు... వెంటనే నిలిపివేయడంతో తప్పిన ప్రమాదం
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook