Kishan Reddy: సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ నుంచి బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు రాబోతున్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల సరళి పరిశీలిస్తే కమల వికాసం ఖాయమని ప్రకటించారు. అందరినీ ఆశ్చర్యపరిచేలా ఫలితాలు ఉండబోతున్నాయని తెలిపారు. రేవంత్‌ రెడ్డి దుష్ప్రచారం చేసినా ప్రజలు తమను  విశ్వసించారని పేర్కొన్నారు. రిజర్వేషన్లు తదితర అంశాలపై తప్పుడు ప్రచారాలు చేశారని గుర్తు చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Revanth Reddy Chitchat: ఇక రాజకీయం ముగిసింది.. పరిపాలనపై దృష్టి సారిస్తా


 


ఢిల్లీలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కిషన్‌ రెడ్డి మాట్లాడారు. మోదీ మళ్లీ ప్రధాని కావాలన్న ఆకాంక్ష తెలంగాణ గ్రామాల్లో స్పష్టంగా కనిపించిందని తెలిపారు. రాజ్యాంగం మార్చడం, రిజర్వేషన్ల అంశాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తే.. ప్రజలు నవ్వుకున్నారని చెప్పారు. అసెంబ్లీ  ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీలను గురించి మాట్లాడలేదని గుర్తు చేశారు. సోనియా పుట్టినరోజు నాడు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అని చెప్పి రేవంత్‌ ఇప్పుడు ఆగస్టుకు వాయిదా వేశాడని మండిపడ్డారు.

Also Read: KTR: అత్యధిక ఎంపీ స్థానాలు మావే.. ఎన్నికల్లో 'కారు'దే తిరుగులేని విజయం


 


తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం కనబడుతోంది. డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఓ నూతన అధ్యాయం ప్రారంభం కానుంది. బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌లకు బీజేపీ సరైన ప్రత్యామ్నాయంగా అవతరించబోతోంది' అని కిషన్‌ రెడ్డి వివరించారు. తెలంగాణలో ఆర్థిక సంక్షోభం ఏర్పడే పరిస్థితులున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల  అమలు  విషయంలో రాజీ పడబోమని ప్రకటించారు. 


ఇకపైనా బురదజల్లే రాజకీయాలు, నీచ రాజకీయాలపై కాకుండా హామీల అమలుపై దృష్టి కేంద్రీకరించాలని రేవంత్‌ రెడ్డికి కిషన్‌ రెడ్డి హితవు పలికారు. హామీల అమలుకు ఆర్థిక వనరుల సమీకరణ ఎలా చేయబోతున్నారో రేవంత్ చెప్పాలని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితంపై కిషన్‌ రెడ్డి స్పందిస్తూ.. 'ఏపీలో ఎన్డీయే కూటమి విజయం సాధించడం ఖాయం' అని ప్రకటించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter