Non-agricultural properties registrations: కార్డ్ విధానంలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు
Non-agricultural properties | హైదరాబాద్ : వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై వస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేపట్టాలని నిర్ణయించుకున్నట్టు సర్కార్ తెలిపింది.
Non-agricultural properties | హైదరాబాద్ : వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై వస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేపట్టాలని నిర్ణయించుకున్నట్టు సర్కార్ తెలిపింది. వచ్చే సోమవారం నుంచి కార్డ్ విధానంలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు చేయనుంది. పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయాలనే హైకోర్టు ఆదేశాల నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం ఒకసారి స్లాట్ బుకింగ్ చేసుకున్నాక యధావిధిగానే పాత పద్ధతిలో మిగతా తతంగం ఉంటుందని ప్రభుత్వం చెప్పిన సమాధానంపై ఆగ్రహం వ్యక్తంచేసిన హై కోర్టు ( Telangana high court )... మరి రిజిస్ట్రేషన్ల సమయంలో పౌరుల వ్యక్తిగత వివరాలు ఎందుకు సేకరిస్తున్నారని మండిపడింది.
Also read : Dharani portal: ఆధార్ వివరాలు అడగవద్దు
హై కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్రంలో నాన్-అగ్రికల్చర్ ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్లు ( Non-agricultural properties registrations ) నిలిపేస్తున్నట్టు శనివారం ఉదయం ప్రకటించిన సర్కార్.. మళ్లీ సాయంత్రానికి తమ నిర్ణయం మార్చుకుని సోమవారం నుంచి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు కొనసాగిస్తామని స్పష్టంచేసింది. ఒకవేళ ఇదివరకే స్లాట్ బుక్ చేసుకుని ఉంటే.. ఆ స్లాట్స్ షెడ్యూల్ ప్రకారమే వారికి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయనున్నట్టు తేల్చిచెప్పింది.
ఇదిలావుంటే, వ్యవసాయ భూములు, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ( Dharani Portal ) చుట్టూ అనేక వివాదాలు అలుముకోవడం, ఆ తర్వాత హై కోర్టులో దీనిపై పలు పిటిషన్స్ దాఖలు అవడం, హై కోర్టు సైతం అసంతృప్తి వ్యక్తంచేయడం వంటి పరిణామాలన్ని తెలిసినవే.
Also read : Properties Registration: తొలిరోజే రూ.85 లక్షల ఆదాయం.. నేడు, రేపు సెలవులు రద్దు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe