Omicron Case in Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ కేసు నమోదైంది. హైదరాబాద్ లోని హయత్‌నగర్‌కు ఇటీవలే 23 ఏళ్ల యువకుడు సూడాన్ నుంచి వచ్చాడు. ఆ యువకుడు ఇప్పుడు ఒమిక్రాన్ వైరస్ బారిన పడినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీంతో అప్రమత్తమైన ఆరోగ్య అధికారులు యువకుడ్ని గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ కేసుతో తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 25కు చేరుకుంది. 
హయత్‌నగర్‌లో ఒమిక్రాన్‌ కేసు నమోదవడంతో వైద్యఆరోగ్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. హయత్​నగర్​లోని సత్యనారాయణ కాలనీలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. బాధితుడు నివసిస్తున్న ప్రాంతంలో కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 


బాధితుడు వ్యాక్సిన్ తీసుకోలేదు


సూడాన్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఆ యువకుడికి కరోనా వైరస్ పాజిటివ్ తేలగా.. అతడి శాంపిల్స్ ను ఒమిక్రాన్ పరీక్షలకు  పంపారు. అయితే అందులోనూ అతడికి పాజిటివ్ గా తేలింది. ఒమిక్రాన్‌ సోకిన ఆ యువకుడు కరోనా వ్యాక్సిన్‌ తీసుకోలేదని స్థానిక వైద్యాధికారిణి తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని వైద్య సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి టీకా తీసుకోని వారి వివరాలు సేకరిస్తున్నారు.   


Also Read: Harish Rao: పీయుష్ గోయల్ బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే-హరీష్ రావు డిమాండ్


Also Read: Cold Wave in Telangana: చలికి వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు.. కనిష్టంగా 4.6 డిగ్రీలు నమోదు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి