One Nation One Election Update: 2027లో జమిలి ఎన్నికలు రాబోతున్నాయా...పొలిటికల్ పార్టీల హడావుడి అందుకేనా ...?
One Nation One Election Update: దేశంలో జమిలి ఎన్నికలకు రంగం సిద్దమైందా..? ఎలాగైనా దేశ వ్యాప్తంగా ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలన్న బీజేపీ పట్టుదల నెరవేరబోతుందా..? గత కొద్ది రోజులుగా ఈ జిమిలి ప్రచారం ఎందుకు మారుమోగుతుంది..? మరో రెండు,మూడేళ్లో జమిలి ఎన్నికలు జరగనున్నాయా..? మొన్నటి దాకా జమిలీనీ విబేధించిన పార్టీలు కూడా ఇప్పుడు సై అంటున్నాయా..? అసలు భారత్ లాంటి అతిపెద్ద దేశంలో జమిలి సాధ్యమేనా..?
One Nation One Election Update: ప్రస్తుతం దేశంలో జమిలి ఎన్నికలపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కేంద్రంలోని మోదీ సర్కార్ జమిలి ఎన్నికల కోసం సంసిద్దమవుతుంది అనే ప్రచారం జోరుగా జరుగుతుంది. ఒకే దేశం ఒకే ఎన్నిక అనే నినాదాన్ని బీజేపీ ఎలాగైనే చేసి చూపాలనే పట్టుదలతో ఉంది.అందులో భాగంగా జమిలి ఎన్నికల నిర్వహణ కోసం విధి విధానాలు ఖరారు చేసే పనిలో ఉంది. ఇప్పటికే మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జమిలి ఎన్నికలపై ఇచ్చిన నివేదికకు కూడా కేంద్రం ఆమోదం వేసింది. దీంతో జిమిలి ఎన్నికలపై కేంద్ర సర్కార్ ఎంత సీరియస్ గా ఉందో అర్థం అవుతుంది. ఈ జిమిలి ఎన్నికలకు సంబంధించిని బిల్లును కూడా త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
జిమిలి ఎన్నికలపై ప్రధానీ మోదీ,అలాగే కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా జమిలీ ఎన్నికలు రావడం ఖాయమన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఎన్డీయే కూటమిలోని పార్టీలకు మోదీ, అమిత్ షా జమిలి ఎన్నికలపై ఒక స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తుంది. దేశంలో ఎప్పుడూ ఏదో ఒక చోట ఎన్నికలు జరుగుతుండడంతో దాని ప్రభావం దేశ ప్రగతి మీద పడుతుందనేది కేంద్రం వాదన. దేశ వ్యాప్తంగా ఒకే సారి లోక్ సభకు, అన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరిగితే బాగుంటుందనేది కేంద్రం అభిప్రాయం. దీనిలో భాగంగా రామ్ నాథ్ కోవింద్ కమిటీ కూడా ఇలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేసింది.ఒకే దేశం ఒకే ఎన్నికతో పారదర్శకత పెరుగుతుందని కోవింద్ కమిటీ తన నివేదికలో పెరుగుతుంది. ఏదైనా ఒక రాష్ట్రంలో హంగ్ వస్తే అవిశ్వాస తీర్మానం పెట్టాక మళ్లీ 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వంద రోజుల్లోనే పనిలో పనిగా దేశ వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించాలని కోవింద్ కమిటీ పేర్కొంది.
అయితై జిమిలి ఎన్నికల నిర్వహణ అంత ఈజీ కాదన్న వాదన లేకపోలేదు. దేశ వ్యాప్తంగా ఒకే సారి ఎన్నికలకు పెద్ద యంత్రాంగం అవసరం ఉంటుంది..దీనిని ఎన్నికల సంఘం ఎలా అధిగమిస్తుందనేది అందరి సందేహం. ఎన్నికలకు సరిపడా యంత్రాంగాన్ని ఎన్నికల సంఘం ఎలా సమకూర్చుంటుందని నిపుణుల నుంచి ఎదురవుతున్న ప్రశ్న. ఐతే ఇదే సమయంలో ఎన్నికలను ఈవీఎంలతో నిర్వహిస్తారా లేక బ్యాలెట్ పద్దతిలో నిర్వహిస్తారా అన్న చర్చ కూడా జరుగుతుంది. ఈవీఎంలతో ఎన్నికలు జరిపితే దేశం మొత్తం సరిపడా ఈవీఎం మిషన్లు అందుబాటులో ఉంటాయనేది కూడా ప్రశ్నగా మారింది.మరి కొందరు బ్యాలెట్ పద్దతిని కూడా ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ కూడా ఉంది..ఇవన్నీ జమిలీ ఎన్నికల నిర్వహణకు ప్రతిబంధకాలుగా మారుతున్నాయి.
ఇక మరోవైపు ఎన్డీయే కూటమిలోని రాష్ట్ర ప్రభుత్వాలు జమిలీకీ సిద్దమై గడువుకు ముందే ప్రభుత్వాన్ని రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎన్డీయేతర ప్రభుత్వాలు ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసుకుంటాయా..?దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది..పార్లమెంట్ లో చట్టం తెస్తే సరిపోతుందా..అనేది కూడా చాలా మంది నుంచి వస్తున్న అనుమానం. ఇదే కాకుండా ఒక వేళ జమిలి ఎన్నికలకు సంబంధించి న్యాయపరంగా సమస్యలు ఎదురైతే అప్పుడు ఏం చేయాలి అన్న దానిపై కూడా కేంద్రం ప్రభుత్వం సీరియస్ గానే దృష్టిపెట్టినట్లు తెలుస్తుంది.ఇలా జమిలి ఎన్నికలు కనుక వస్తే ఎన్నికల సంఘం అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఇక మరోవైపు కేంద్రం జమిలి వైపుగా అడుగులు వేస్తుంటే దేశంలోని రాజకీయ పార్టీలు కూడా జమిలికీ నై అంటూనే ఎలాంటి పరిస్థితులు వచ్చినా సిద్దంగా ఉండాలని తమ శ్రేణులకు పిలుపునిస్తున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు జమిలి ఎన్నికలు రావడం ఖాయంగా అనిపిస్తుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ జమిలిపై పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఏపీ, తెలంగాణలోని అధికార, ప్రతిపక్షాలు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎన్నికలు వస్తాయనే ధీమాతో ఉన్నట్లు కనిపిస్తుంది.అందులో భాగంగా వారు ఎన్నికలకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తుంది. అధికార పక్షం సంక్షేమ పథకాల జోరును పెంచితే, ప్రతిపక్షాలు యాత్రలు,ఆందోళనలతో ప్రజలకు మరింత చేరువయ్యేలా వ్యూహాలు రచిస్తున్నారు. పార్టీల హడావుడి చూస్తుంటూ నిజంగానే జమిలి ఖాయంగా కనిపిస్తుంది. కొందరు నేతలైతే ఏకంగా 2027 సంవత్సరంలో కానీ 2028లో కానీ జమిలి వస్తాయని కూడా అధికారికంగా ప్రకటనలు చేస్తున్నారు.
మొత్తానికి ఈ జమిలి ఎన్నికలపై దేశ ప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఒక వేళ జమిలి జరిగితే జనం తీర్పు ఎలా ఉండబోతుంది..? దేశం మొత్తం ఒకే సారి ఓటు వేయాడానికి పోటెత్తితే ఎన్నికల సంఘం ఎలాంటి ఏర్పాట్లు చేయబోతుంది..? నిజంగానే జమిలి ఎన్నికలు విజయవంతం ఐతే భారతదేశం ప్రపంచానికి ఒక కొత్త సందేశాన్ని పంపించినట్లు అవుతుంది. ఏక కాలంలో దేశ ప్రజలు అందరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు అవుతుంది. చీటికి మాటికి ఎన్నికలతో జరిగే నష్టాలు జమిలితో ఉండబోవు. అభివృద్ధి అనేది నిరంతరం కొనసాగుతుంది.
మరి జమిలి ఎన్నికల నిర్వహణ కోసం కేంద్రం మున్ముందు ఎలాంటి అడుగులు వేయబోతుంది..? జమిలి ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు రాకుండా ఉండేందుకు ఏం చేయబోతుంది..? ఎన్నికలు వస్తే ఎన్నికల సంఘం ఎలా సిద్దమవుతుంది అనేది మాత్రం భవిష్యత్తులోనే తేలుతుంది.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.