Heart Stroke Girl Died: మాయదారి గుండెపోటు వయసు తేడా చూడకుండా బలి తీసుకుంటోంది. వృద్ధులతోపాటు చిన్నారులను కూడా గుండెపోటు బలి తీసుకుంటుండడంతో బాధిత కుటుంబాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా తెలంగాణలో మరో చిన్నారి ఛాతీనొప్పితో బాధపడతూ తల్లి ఒడిలోనే మృతి చెందింది. గ్రూపు 3 పరీక్ష రాసి వచ్చి ఆనందంగా ఎత్తుకున్న సమయంలో ఆ బాలిక ఆనందంలోనే కన్నుమూయడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. కాగా గతంలో పాప మాట్లాడిన బుజ్జి బుజ్జి మాటలు వింటూ ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Money Issue: ప్రియురాలిని 22 ముక్కలు నరికి కసి తీర్చుకున్న ప్రియుడు.. ఎందుకంటే?


ఖమ్మం జిల్లా ఎంవీ పాలెంలో కుర్ర వినోద్, లావణ్య దంపతులకు నాలుగేళ్ల చిన్నారి ప్రహర్షిక. ప్రభుత్వ ఉద్యోగాలకు లావణ్య సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఆది, సోమవారాల్లో నిర్వహించిన గ్రూపు 3 పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షకు వెళ్లిన సమయంలో తన కుమార్తెను తాతయ్య, నానమ్మ దగ్గర వదిలి వెళ్లింది. ఆదివారం బాగానే ప్రహర్షిక.. సోమవారం తల్లి పరీక్షకు వెళ్లిన సమయంలో తాతయ్య, నాన్నమ్మల వద్ద ఆడుకుంటూ కనిపించింది.

Also Read: Tragic Incident: ప్రేమతో భార్య చికెన్‌ బిర్యానీ పెట్టగా.. తెల్లారేసరికి శవమైన భర్త


సోమవారం ఉదయం గ్రూపు 3 పరీక్ష ముగించుకొని తల్లి లావణ్య ఇంటికి చేరింది. తల్లిని చూసిన ఆనందంలో ప్రహర్షిక 'అమ్మా' అంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి కౌగిలించుకుంది. అయితే వెళ్లిన వెంటనే తల్లి ఒడిలోనే ప్రహర్షిక కుప్పకూలిపోయింది. కంగారు పడిన లావణ్య ఏమైందని అడగగా 'ఛాతిలో నొప్పి వస్తుంది' అని చెప్పి ప్రహర్షిక అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే కుటుంబసభ్యులు గ్రామంలోని ఆర్‌ఎంపీ దగ్గరకు తీసుకెళ్లగా ఖమ్మం తీసుకెళ్లాలని సూచించారు. 


అక్కడి నుంచి వెంటనే తల్లిదండ్రులు ఖమ్మంలోని ఓ ప్రవేటు వైద్యాశాలకు తీసుకెళ్లారు. చిన్నారి ప్రహర్షికను పరీక్షించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆరోగ్యంగా ఉన్న బాలిక అకస్మాత్తుగా మృతి చెందడం కలకలం రేపింది. చిన్న వయసులోనే గుండెపోటు రావడం విస్మయానికి గురి చేసింది. పాప మరణానికి గుండెపోటు కారణమా? లేక మరో కారణమా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఆడుతూ పాడుతూ అల్లరి చేస్తున్న ప్రహర్షిక లేకపోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది.





స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter