Pickpocketer: రైలులో బెడిసికొట్టిన దొంగతనం.. దొంగను చితక్కొట్టిన `మెట్రో` ప్రయాణికులు
Picpocketer: గమ్యస్థానాలకు చేరేందుకు మెట్రో ఎంతో దోహదం చేస్తుంది. సులభంగా.. వేగంగా ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీగా జరిగే మెట్రో ప్రయాణంలో దొంగల బెడద వేధిస్తోంది. ఢిల్లీ మెట్రోలో జేబుదొంగలు తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఓ దొంగ అలాగే దొంగతనం చేయడానికి ప్రయత్నించగా ప్రయాణికులు అప్రమత్తమై రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడిని పొట్టుపొట్టు కొట్టి పోలీసులకు అప్పగించారు.
Metro Theft: ఇటీవల ఢిల్లీ మెట్రో రైలులో దొంగల బెడద తీవ్రంగా ఉంది. పర్సులు, హ్యాండ్‌బ్యాగ్‌లు, గొలుసులు, సెల్‌ఫోన్లు తదితర వస్తువులు దొంగతనానికి పాల్పడుతున్నారు. దీంతో ప్రయాణికులు మెట్రో ప్రయాణం అంటేనే భయపడుతున్నారు. తాజాగా గణతంత్ర దినోత్సవం రోజు కూడా దొంగతనాలు జరిగాయి. మెట్రో రైలులో ఓ దొంగ ప్రయాణికుడి జేబులో పర్సు దొంగతనానికి పాల్పడడానికి యత్నించాడు.
ప్రయాణికుడి వెనుక జేబులో ఉన్న పర్సును జాగ్రత్తగా తీశాడు. కానీ పొరపాటున ఆ పర్సు కిందపడిపోయింది. ఇది గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ పర్సు సైనిక ఉద్యోగిది. తన పర్సు దొంగతనం చేసేందుకు ప్రయత్నించిన దొంగను ఆ సైనికుడు వెంటనే పట్టుకున్నాడు. రైలు బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా దొంగ బలవంతంగా రాడ్ పట్టుకుని నిలబడ్డాడు. తోటి ప్రయాణికులంతా కలిసి దొంగను బలవంతంగా బయటకు లాక్కొచ్చారు. అనంతరం అతడిపై దాడి చేశారు.
అక్కడి ప్లాట్ ఫారంపైన ఢిల్లీ పోలీసులకు దొంగను అప్పగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గణతంత్ర దినోత్సవం రోజున అది ఒక సైనికుడి జేబు నుంచి దొంగతనానికి పాల్పడడం విశేషం. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఇలాంటి వాళ్లు చాలా మంది తయారయ్యారని ఢిల్లీ ప్రజలు చెబుతున్నారు. ఇలాంటి దొంగలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇటీవల ఢిల్లీ మెట్రోలో తరచూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని 'ఎక్స్'లో ఢిల్లీ పోలీసులకు నెటిజన్లు ఫిర్యాదు చేస్తున్నారు. కాగా దొంగకు సంబంధించి వివరాలు ఇంకా బయటకు రాలేదు. అతడు ఒక్కడేనా లేదా ఒక గ్యాంగ్ ఇలా దొంగతనాలకు పాల్పడుతుందా అనేది పోలీసులు విచారణ చేపడుతున్నారు. దొంగలు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రయాణికులు కూడా జాగ్రత్తలు పడాలని ఢిల్లీ మెట్రో అధికారులు సూచిస్తున్నారు. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.
Also Read: KTR Republic Day: గవర్నర్ తీరుపై కేటీఆర్ ఆగ్రహం.. బీజేపీ, కాంగ్రెస్ ఫెవికాల్ బంధమంటూ వ్యాఖ్యలు
Also Read: Republic Day: విషాదం నింపిన 'గణతంత్ర వేడుకలు'.. జెండా కర్రకు విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు దుర్మరణం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook