Hyderabad Traffic Diversion: దేశ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపధ్యంలో హైదరాబాద్ నగరంలో ఇవాళ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఏయే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలున్నాయి, ట్రాఫిక్ ఎటు మళ్లించారనేది ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వార్షిక, స్నాతకోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గచ్చిబౌలి జంక్షన్ నుంచి లింగంపల్లివైపు వెళ్లే వాహనాల్ని గచ్చిబౌలి జంక్షన్ నుంచి కుడివైపుగా బొటానికల్ గార్డెన్స్ వైపుకు మళ్లించారు. అక్కడి నుంచి ఎడమవైపుగా కొండాపూర్ నుంచి బాండా మసీదు మీదుగా కుడివైపుకు హెచ్‌సీయూ డిపో రోడ్ మీదుగా లింగంపల్లి చేరుకోవాలి. 


ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఇవాళ మద్యాహ్నం 1 గంట నుంచి సాయంత్ర 5 గంటల వరకూ ఉంటాయి. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన నేపధ్యంలో సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ మళ్లింపులపై మార్గదర్శకాలు జారీ చేశారు. గచ్చిబౌలి స్డేడియం నుంచి ఐఐఐటీ జంక్షన్, ఐఐఐటీ జంక్షన్ నుంచి విప్రో జంక్షన్, ఐఐఐటీ జంక్షన్ నుంచి గచ్చిబౌలి ప్రాంతాల్లో ఆఫీసులున్నవాళ్లు తమ తమ పని వేళల్ని ఇందుకు అనుగుణంగా మార్చుకోవడం లేదా వర్క్ ఫ్రం హోం తీసుకోవడం చేయాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు. 


ట్రాఫిక్ మళ్లింపు  ఇలా


గచ్చిబౌలి జంక్షన్ నుంచి లింగంపల్లికి వెళ్లే వాహనాలు..గచ్చిబౌలి జంక్షన్ నుంచి కుడివైపు బొటానికల్ గార్డెన్స్ మీదుగా..తిరిగి అక్కడి నుంచి ఎడమవైపుకు కొండాపూర్ ఏరియా హాస్పటల్ బాండా మసీదు మీదుగా ఎడమ చేతివైపుకు వెళ్లాలి. అక్కడి నుంచి బాండా మసీదు కమాన్ నుంచి కుడివైపుకు హెచ్‌సీయూ డిపో మీదుగా లింగంపల్లి రోడ్డుకు చేరుకోవాలి.


ఇక లింగంపల్లి నుంచి గచ్చిబౌలికు వెళ్లే వాహనాలు హెచ్‌సీయూ డిపో నుంచి ఎడమవైపుకు బాండా మసీదు కమాన్ మీదుగా తిరిగి ఎడమవైపుకు కొండాపూర్ ఏరియా హాస్పటల్ నుంచి బొటానికల్ గార్డెన్స్ మీదుగా గచ్చిబౌలి జంక్షన్ చేరుకోవాలి.


ఇక విప్రో జంక్షన్ నుంచి లింగంపల్లికి వెళ్లేవారు విప్రో జంక్షన్ నుంచి ఎడమవైపుకు క్యూ సిటీ వైపుకు మళ్లాలి. అక్కడి నుంచి గౌలిదొడ్డి, గోపాన్‌పల్లి క్రాస్ రోడ్స్ మీదుగా హెచ్‌సీయూ వెనుక గేట్ నుంచి నల్లగండ్ల మీదుగా లింగంపల్లి రోడ్డుకు చేరాలి.


ఇక విప్రో జంక్షన్ నుంచి గచ్చిబౌలి వెళ్లే వాహనాలు విప్రో జంక్షన్ నుంచి కుడివైపు ఫెయిర్‌ఫీల్డ్ హోటల్ మీదుగా నానక్‌రామ్‌గూడ రోటరీ నుంచి ఎడమవైపుకు ఓఆర్ఆర్‌కు వెళ్లి..అక్కడి నుంచి ఎల్ అండ్ టి టవర్స్ మీదుగా గచ్చిబౌలికి చేరుకోవాలి.


ఇక కేబుల్ బ్రిడ్జి నుంచి గచ్చిబౌలి జంక్షన్ చేరుకునేవాళ్లు..కేబుల్ బ్రిడ్జి ఎగువ ర్యాంప్ రోడ్ నెంబర్ 45 మీదుగా రత్నదీప్-మాధాపూర్ సైబర్ టవర్స్, హైటెక్స్ మీదుగా బొటానికల్ గార్డెన్స్ చేరుకోవాలి. 


Also read: Modi Hyderabad Tour: నేడే మోదీ హైదరాబాద్ పర్యటన, రెండున్నర గంటల షెడ్యూల్ ఇలా..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి