PM Modi: ఈ నెల 8న ప్రధాని మోదీ తెలంగాణ టూర్.. రూ.11,355 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
PM Modi Telangana Tour: తెలంగాణలో రూ.11,355 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ రైలును ప్రధాని ప్రారంభించనున్నారు. ప్రధానమంత్రి తెలంగాణ టూర్ వివరాలు ఇలా..
PM Modi Telangana Tour: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8వ తేదీన తెలంగాణ పర్యటనకు విచ్చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా రూ.11,355 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకోనున్న ప్రధానమంత్రి.. తొలుత సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ రైలును పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇది దేశంలో ప్రవేశపెట్టనున్న 13వ వందేభారత్ రైలు. ఈ రైలు కారణంగా సికింద్రాబాద్-తిరుపతిల మధ్యన ప్రయాణ సమయం 12 గం.ల నుంచి 8 గం.ల 30 ని.లకు తగ్గిపోనుంది. హైదరాబాద్ నుంచి ఆధ్యాత్మిక నగరం తిరుపతికి ప్రయాణించనున్న వారికి అనుకూలంగా ఈ వందేభారత్ రైలు సేవలు ఉండనున్నాయి. ప్రధాని మోదీ పర్యటన వివరాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.
అనంతరం రూ.715 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న 25 వేల మంది ప్రయాణికుల నుంచి రద్దీ సమయంలో 3,25,000 మంది ప్రయాణికులకు కూడా సౌకర్యాలను అందించగలిగేలా రైల్వే స్టేషన్ సామర్థ్యాన్ని పెంచనున్నారు. టెర్మినల్ బిల్డింగ్ నుంచి అన్ని ప్లాట్ ఫామ్స్‌ను కలిపేలా 108 మీటర్ల ప్రత్యేక డబుల్ లెవెల్ వంతెనను ఈ స్టేషన్‌లో ఏర్పాటు చేయనున్నారు.
సికింద్రాబాద్-మహబూబ్ నగర్ మధ్య రూ.1,410 కోట్లతో పూర్తి చేసిన 85 కి.మీ.ల పొడవైన డబ్లింగ్ రైల్వే లైన్‌ను జాతికి అంకితం చేయనున్నారు. ఎంఎంటీఎస్ ఫేజ్-IIలో భాగంగా హైదరాబాద్ నగర శివారు పట్టణాల వరకు నిర్మించిన నూతన రైల్వే లైన్ల మీదుగా నడవనున్న 13 కొత్త ఎంఎంటీఎస్ సర్వీసులను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.
ఆ తరువాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ప్రధానమంత్రి చేరుకోనున్నారు. మొదట రూ.7,864 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 6 జాతీయ రహదారులకు, రూ.1,366 కోట్లతో బీబీనగర్ ఎయిమ్స్‌లో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రాజెక్టుల భూమిపూజ కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ బహిరంగ సభకు హాజరైన ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
Also Read: తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ భారీ ఓటమి.. రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ
Also Read: RCB vs MI Match Updates: ఐపీఎల్‌లో మరో సూపర్ ఫైట్.. టాస్ గెలిచిన ఆర్‌సీబీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి