Pochamma Temple Incident: హైదరాబాద్ లో మరో ఆలయంపై దాడి..
Pochamma Temple Incident: ఆలయాలపై వరుస దాడులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ పోచమ్మ ఆలయం ఘటన, ఆ తర్వాత శంషాబాద్ ఆలయ ఘటన మరవక ముందే మరో ఆలయంపై ఘటన చోటు చేసుకుంది. తాజాగా జరిగిన ఘటనపై హిందూ సంఘాలు .. ప్రభుత్వ నిఘా వైఫల్యంతో పాటు పోలీసులు అలసత్వంపై మండిపడుతున్నారు.
Pochamma Temple Incident: తెలంగాణ ఆలయాలపై వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే
శంషాబాద్‌లో మరో ఆలయంపై దాడి చేశారు దుండగులు. జూకల్ గ్రామంలో పోచమ్మ ఆలయంపై దాడి చేశారు దుండగులు. అమ్మవారి కన్ను, అమ్మవారి చీరను తొలగించి బయట పడేశారు. గమనించిన స్థానికులు ఓ అనుమానితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
పోలీసులు అనుమానితుడ్ని విచారిస్తున్నారు. టెంపుల్‌పై దాడితో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. దీంతో అర్థరాత్రి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఇప్పటికే ముత్యాలమ్మ ఆలయం ఘటన.. ఆ తర్వాత నవగ్రహాల విగ్రహాల ధ్వంసం ఘటన మరవక ముందే మరో ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఘటనలపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. మరోవైపు తెలంగాణలో ఆలయాలపై దాడి చేస్తున్న ప్రభుత్వం చూసీ చూడనట్టు వ్యవహరిస్తుందని చెబుతున్నారు.
అంతేకాదు తెలంగాణలో ఆలయాలపై జరుగుతున్న దుర్ఘటనలపై పోలీసులు, ఇంటెలిజెన్స్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పోలీసులు ఉన్నతాధికారులు ఉద్యోగం సరిగా చేస్తే ఈ దుస్థతి వచ్చేది కాదన్నది అందరు చెబుతున్న మాట. ఏది ఏమైనా వేరే కమ్యూనిటీలపై ఏదైనా చిన్న దాడి జరిగితే స్పందించే ప్రభుత్వ యంత్రాంగం.. హిందువు దేవాలయలపై జరుగుతున్న ఈ ఘటనలపై చీమకుట్టినట్టైన లేకపోవడం విస్మయం కలిగిస్తుందని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా హిందూ ఆలయాలను టార్గెట్ చేస్తూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. మరి ప్రభుత్వం ఇకనైనా స్పందించి.. రాష్ట్రంలోని ఆలయాలపై నిఘా పెట్టేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.