Transgenders: రోడ్లపై హిజ్రాల ఎక్స్ పోజింగ్.. 11 మంది అరెస్ట్..
Transgenders Arrest: తెలంగాణలో హిజ్రాల అరాచకాలు మితీమీరాయి. ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా.. అక్కడ వాలిపోయి.. వారిని నానారకాలుగా హింసించి వారివద్ద నుంచి డబ్బులు తీసుకోవడం వీరికి అలవాటుగా మారిపోయింది. అయితే.. తాజాగా హైదరాబాద్ పరిధిలో ని సైబరాబాద్ లో 11 మంది హిజ్రాలను అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.
Transgenders Arrest: ట్రాన్స్ జెండర్స్ ను శివుడి అర్ధనారీశ్వర తత్త్వంగా భావించడం అనాదిగా వస్తోంది. మహా భారతంలో కూడా అర్జునుడు కూడా బృహన్నలగా అజ్ఞాతవాసం చేసాడు. ఒక రకంగా హిజ్రాల సంస్కృతి తరతరాలుగా ఉంది. ఒకపుడు తెలంగాణలో సెటిలైన మార్వాడి కటుంబాలు వాళ్ల ఇంట్లో పిల్లనో.. పిల్లాడో పుడితే.. వారి చుట్టు డబ్బులను దిష్ఠి తీస్తూ ఆ డబ్బులను హిజ్రాలకు ఇస్తే మంచి జరగుతుందనేది ఓ అభిప్రాయం. కేవలం ఎవరైనా ఇంట్లో సంతానం కలిగితే.. వీళ్లు వాలిపోయేవారు. కానీ రాను రాను వీళ్లు ఎక్కడ పందిరి కనపడినా.. గృహ ప్రవేశం జరిగినా.. అక్కడ వాళ్లు వాలిపోతారు. వారికో పెద్ద నెట్ వర్క్ కూడా ఉందనేది పోలీసుల వాదన. స్థానికంగా ఉండే కొంత మంది ఆటో డ్రైవర్లు.. కాలనీ వాచ్ మెన్లతో పాటు కొంత మంది వీళ్లతో మిలాఖత్ అయి ఉన్నారు. ఎక్కడ ఫంక్షన్ జరిగినట్టు కనిపించాన.. అక్కడ గుంపుగా ప్రత్యక్షమై.. వాళ్లను డబ్బులు ఇవ్వమని పీడిస్తారు. ఒకవేళ ఇవ్వకపోతే.. ఆయా ఇంట్లో ఉండే ఆడవాళ్ల ముందర బట్టలు విప్పిస్తామని బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. వాళ్ల బ్లాక్ మెయిల్ కు భయపడి చాలా మంది వాళ్లు చెప్పిన డబ్బులు సమర్పించుకుంటారు.
ఈ విషయమై పోలీసులకు కంప్లైంట్ చేసినా.. పోలీసులు కూడా ఎంతో కొంత ఇచ్చి వారిని విడిపించుకోమని కంప్లైంట్ ఇచ్చినవాళ్లకు ఉచిత సలహాలు ఇస్తుంటారు. ఇక హిజ్రాల ఆదాయంలో కొంత మంది పోలీసులకు కూడా వాటా ఉందనేది సమాచారం. ఒక్కోసారి పోలీసుల ఇళ్లలో కూడా వీళ్లు గుంపులుగా పడి వాళ్లను కూడా పీడించిన సందర్భాలున్నాయి. వాళ్లతో పెట్టుకోవడం ఎందుకనో.. ఎంతో కొంత ఇచ్చి వారి పీడ ఒదిలించుకుంటున్నారు. మన హైదరాబాద్ లో సికింద్రాబాద్ చిలకల గూడా రైల్వే స్టేషన్ సమీపంతో పాటు హైవేలపై అందంగా తయారై నిలబడి విటులను ఆకర్షిస్తూ ఉంటారు. కొంత మందిని భయపెట్ట వారినీ నిలువు దోపిడి చేసిన సందర్భాలున్నాయి.
వీళ్ల ఆదాయం చూసి కొంత మంది కన్నుకుట్టినట్లైంది. తాజాగా సైబరాబాద్‌లో 11 మంది హిజ్రాలను పోలీసులు అరెస్టు చేశారు. ఐకియా దగ్గర 8 మంది, ఖైతలపుర్ బ్రిడ్జి దగ్గర ఇద్దరినీ, బొటానికల్ గార్డెన్ దగ్గర మరొకరిని అరెస్ట్ చేశారు. అసభ్య దుస్తులు వేసుకొని రోడ్డుపై వెళుతున్న వారిని అడ్డుకోవడం, భయభ్రాంతులకు గురిచేయడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.హిజ్రా ముసుగులో అసభ్య కార్యకలాపాలకు పాల్పడుతున్న పోలీసులు గుర్తించారు. అంతేకాదు వారిని అరెస్ట్ చేసారు. ఇందులో చాలా మంది దొంగ హిజ్రాలున్నారు.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.