Child Marriage in Nirmal: అతడికి గత జూలై నెలలోనే వివాహమైంది. భార్యకు సంతానం కలగదని తెలుసుకున్నాడు. పెళ్లై నెల కాకముందే.. భార్యతో తెగదెంపులు చేసుకున్నాడు. ఇక రెండో పెళ్లికి రెడీ అయి.. ఓ బాలిక కుటుంబ సభ్యులకు పాతిక వేలు ఇచ్చి వివాహం చేసుకున్నాడు. పెళ్లి ఇష్టం లేని ఆ బాలిక సర్పంచ్ సహకారంతో పోలీసులు, అధికారులను ఆశ్రయించింది. నిర్మల్‌ జిల్లా కుంటాల మండలంలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు ఇలా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుంటాల మండంలోని ఓలా గ్రామానికి చెందిన దంపతులకు ఓ కుమార్తె (14) ఉంది. ఆ బాలికకు నిర్మల్‌ రూరల్ మండలం కొండాపూర్‌ గ్రామానికి చెందిన దాసరి నగేష్‌ (33)తో అనే యువకుడితో పెళ్లి నిశ్చయించారు. బాలికకు పెళ్లి ఇష్టం లేకపోయినా.. కుటుంబ సభ్యులు 10 రోజుల క్రితం బలవంతంగా నిశ్చితార్థం జరిపించారు. ఆదివారం కొండాపూర్‌లో వివాహం కూడా జరిగిపోయింది.


పెళ్లి తరువాత కార్యక్రమాల్లో భాగంగా.. ఆదివారం రాత్రి కొత్త జంటతోపాటు రెండు కుటుంబాల సభ్యులు అందరూ ఓలా గ్రామానికి వచ్చారు. సోమవారం ఉదయం దావత్ చేసుకునేందుకు నగేష్‌తోపాటు కుటుంబ సభ్యులు అందరూ మద్యం తాగేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇదే అదనుగా భావించిన బాలిక.. ఇంటి నుంచి బయటకు వచ్చి సర్పంచ్ ఫాతిమాను కలిసి విషయం చెప్పింది. తనకు ఇష్టంలేని వివాహం చేశారని తెలిపింది. తన తల్లి, మేనమామ పెళ్లికొడుకు కుటుంబసభ్యుల వద్ద రూ.25 వేలు తీసుకుని తనను కొట్టి బలవంతంగా పెళ్లి చేశారని కన్నీటి పర్యాంతం అవుతూ తన గోడును వెళ్లబోసుకుంది. 


సర్పంచ్ ఫాతిమా వెంటనే పోలీసులు, ఐసీడీఎస్‌ సూపరింటెండెంట్‌ లక్ష్మీవిశారదకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఓలా గ్రామానికి చేరుకున్న వారు.. ఇరువైపులా కుటుంబ సభ్యులను విచారించారు. బాలిక వయసు ధృవీకరణ పత్రాలను పరిశీలించి.. బాల్య వివాహం జరిపించినట్లు గుర్తించారు. బాలికను పెళ్లి చేసుకున్న దాసరి నగేష్ గురించి తెలుసుకుని అవాక్కయ్యారు. పిల్లలు పుట్టారని మొదటి భార్యతో తెగదెంపులు చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. అతడికి జూలై నెలలోనే మొదటి పెళ్లి జరిగిందని చెప్పారు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. బాలికను నిర్మల్ సఖీ కేంద్రంలో ఐసీడీఎస్‌ అధికారులు చేర్పించి రక్షణ కల్పించారు. 


Also Read: Ind vs WI 3rd T20 Updates: విండీస్‌తో నేడే మూడో టీ20.. ఓడితే సిరీస్ గోవిందా..!  


Also Read: Gaddar Cremation:గద్దర్ అంత్యక్రియల్లో అపశృతి.. తొక్కిసలాటలో సీనియర్ జర్నలిస్ట్ మృతి


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి