Adulterated Petrol in Hyderabad Petrol Bunk: హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలో ఓఆర్ఆర్ సమీపంలో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో ఘరానా మోసం వెలుగుచూసింది. బంక్‌కి వచ్చిన నాలుగు కార్లు, ఒక బోర్‌వెల్ లారీలో నీరు కలిపిన డీజిల్ పోయడంతో.. ఆ వాహనాలు ముందుకు కదలక అక్కడే ఆగిపోయాయి.  అనుమానం వచ్చిన వాహన యజమానులు టెస్టింగ్ చేయగా.. డీజిల్‌లో నీరు కలిసినట్లు గుర్తించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంక్ సిబ్బందిని ప్రశ్నించగా.. పొరపాటున డీజిల్‌లో నీళ్లు కలిశాయని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో ఆగ్రహించిన వాహన యజమానులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వాహనదారులను మోసం చేస్తున్న పెట్రోల్ బంక్‌ని మూసివేయాలని డిమాండ్ చేశారు. వాహనదారుల ఫిర్యాదుతో పోలీసులు ఆ పెట్రోల్ బంక్ సిబ్బందిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.


కాగా, కొద్దిరోజుల క్రితం కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లోనూ ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. పట్టణంలోని ఓ పెట్రోల్ బంక్‌లో ఓ వాహనదారుడు రూ.250 పెట్రోల్ కొట్టించగా.. కొద్ది దూరం వెళ్లగానే బండి ఆగిపోయింది. దీంతో బైక్‌ను మెకానిక్ షెడ్డుకు తీసుకెళ్లగా.. పెట్రోల్ ట్యాంకులో నీళ్లు ఉన్నట్లు గుర్తించారు. ట్యాంకులో ఉన్న పెట్రోల్‌ను బాటిల్‌లో పోయగా.. అందులో సగానికి పైగా నీళ్లు ఉన్నట్లు బయటపడింది. ఆగ్రహించిన సదరు వ్యక్తి పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి సిబ్బందిని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీనిపై స్థానిక అధికారులకు ఫిర్యాదు చేయగా.. ఆ పెట్రోల్ బంక్‌లో అంతా బాగానే ఉందని వారు చెప్పడంతో అవాక్కయ్యాడు. గతంలోనూ ఇలాంటి ఘటనలు పలు చోట్ల వెలుగుచూసిన సంగతి తెలిసిందే. 


Also Read: IND vs SL: జడేజా సూపర్ షో.. తొలి టెస్టులో భారత్ ఘన విజయం! విరాట్ కోహ్లీకి స్పెషల్ గిఫ్ట్!!


Also Read: Trivikram Remuneration: త్రివిక్రమ్ షాకింగ్ రెమ్యూనరేషన్.. 'సూపర్ స్టార్' మహేష్ బాబుకు పోటీగా!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook