Gaddar funeral at Mahabodhi School in Alwal: ప్రజా గాయకుడు గద్దర్‌ (76) ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ఉన్న అపోలో స్పెక్ట్రా దవాఖానలో తుదిశ్వాస విడిచారు. అల్వాల్ లోని తన ఇంటి వద్ద గత నెల 20న గద్దర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను అమీర్‌పేటలో ఉన్న అపోలో స్పెక్ట్రా ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుండే గద్దర్ అక్కడే చికిత్స పొందుతారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హార్ట్ లో సమస్య ఉండటంతో ఈనెల 3న ఆయనకు వైద్యులు బైపాస్ సర్జరీ నిర్వహించారు. అది విజయవంతమైనట్లు వైద్యులు తెలిపారు. అప్పటి నుంచి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు గద్దర్. సడన్ గా  ఊపిరితిత్తులు, మూత్ర సంబంధిత సమస్యలు తలెత్తడంతో గద్దర్ ఆరోగ్యం ఆదివారం మరింత క్షీణించింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో ఆయన అభిమానులు, రాజకీయ నేతలు ఆస్పత్రి వద్దకు చేరుకుని గద్దర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. 


తరలి వచ్చిన ప్రముఖులు..
గద్దర్ పార్థివదేహాన్ని ఎల్బీ స్టేడియానికి తరలించారు. ఆయన మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం ప్రకటించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్, మంత్రి కేటీఆర్ ఆయన భౌతిక దేహానికి నివాళులర్పించారు. పలువురు ప్రజాగాయకులు, అభిమానులు, వామపక్ష నేతలు గద్దర్‌ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 


అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
గద్దర్ అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించనుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఎల్బీ స్టేడియం నుంచి సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అల్వాల్ లోని భూదేవినగర్ లో ఉన్న గద్దర్ నివాసం వరకు అంతిమయాత్ర జరగనుంది. అల్వాల్ లోని గద్దర్ నెలకొల్పిన మహాబోధి విద్యాలయంలో అంత్యక్రియలు చేయనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. 


గద్దర్ ప్రస్థానం
గద్దర్ అసలు పేరు గమ్మడి విఠల్ రావ్. ఈయన మెదక్ జిల్లా తూఫ్రాన్ లో 1947 ఆగస్టు 04న జన్మించారు. ఆయనకు భార్య విమల, ముగ్గురు సంతానం. వీరి పిల్లల పేర్లు సూర్యుడు, చంద్రుడు, వెన్నెల. రెండో కుమారుడు చంద్రుడు 2003లో అనారోగ్యంతో కన్నుమూశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన తన ఆట, పాటలతో ప్రజల్లో చైతన్యాన్ని నింపారు. 1997 ఏప్రిల్ 06న గద్దర్ పై హత్యాయత్నం జరిగింది. నీ పాదం మీద పుట్టుముచ్చనై చెల్లెమ్మా, అమ్మా తెలంగాణమా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, బండెనక బండిగట్టి వంటి పాటలు ఆయనకు మంచి పేరు తెచ్చిపట్టాయి. 


Also Read: Gaddar: నా గుండె చప్పుడు ఆగిపోలేదు.. కన్నీరు పెట్టిస్తున్న గద్దర్ చివరి ప్రకటన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి