భారత ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటించనున్నారు. భారత్ బయోటెక్ సంస్థ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అటు జీహెచ్ఎంసీ ఎన్నికల నేపధ్యంలో ప్రధాని పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్  ఎన్నికలు ( Greater Hyderabad municipal corporation elections ) డిసెంబర్ 1న జరగనున్నాయి. అదే సమయంలో డిసెంబర్ 29న భారత ప్రధాని నరేంద్ర మోదీ ( Prime minister narendra modi ) నగరంలో పర్యటించనున్నారు. గ్రేటర్ ఎన్నికలతో ప్రధాని మోదీ పర్యటనకు సంబంధం లేకపోయినా..ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ నగరంలోని భారత్ బయోటెక్ కంపెనీ ( Bharat biotech ) అభివృద్ధి చేస్తున్న తొలి కరోనా వ్యాక్సిన్ పురోగతిని మోదీ పరిశీలించనున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా హకీంపేట్ కు ప్రత్యేక విమానంలో రానున్నారు. వ్యాక్సిన్ కు సంబంధించి ఏర్పాటైన కీలక సమావేశంలో పాల్గొంచారు.


మరోవైపు కరోనా వ్యాక్సిన్ కీలకదశకు చేరుకున్న నేపధ్యంలో ప్రధాని మోదీ పూణే నగరానికి సైతం వెళ్లనున్నారు. అతి పెద్ద వ్యాక్సిన్ ఉత్పత్తిదారైన సీరమ్ ఇనిస్టిట్యూట్ వ్యాక్సిన్ ( Serum institute vaccine ) పై ప్రధాని మోదీ సమీక్షించనున్నారు. హైదరాబాద్, పూణే రెండు నగరాల పర్యటన కోవిడ్ వ్యాక్సిన్ కు సంబంధించి కావడం విశేషం.


అయితే గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ప్రచారపర్వం ముగియడానికి కేవలం 50 నిమిషాల ముందు ప్రధాని పర్యటన జరగడం ఆసక్తి కల్గిస్తోంది. అవసరమైతే ప్రధానమంత్రి మోదీని కూడా జీహెచ్ఎంసీ ప్రచారానికి ( GHMC Election campaign ) పిలుచుకొస్తారని ఇప్పటికే మంత్రి కేటీఆర్ సెటైర్ విసిరారు. Also read: GHMC Elections 2020: 28న సీఎం కేసీఆర్ ప్రచార సభ