Private travels bus catches fire : జనగాం: జనగాం జిల్లాలో నెల్లుట్ల వద్ద ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు నిప్పంటుకుని బస్సు మొత్తం దగ్ధమైంది. అదృష్టవశాత్తుగా ఈ ఘటనలో ప్రయాణికులు అందరూ క్షేమంగా బయటపడినట్టు జనగాం పోలీసులు తెలిపారు. ఛత్తీస్‎ఘడ్ నుంచి హైదరాబాద్ బయల్దేరిన కృష్ణా ప్రైవేటు బస్సు జనగామ సమీపంలోని నెల్లుట్ల వద్దకు రాగానే ఇంజన్‌లో షార్ట్ సర్క్యూట్ (Short circuit) కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బస్సు ఇంజన్‎లోంచి పొగ రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును ఓ పక్కకు ఆపేసి ప్రయాణికులను కిందకు దించేశాడు. దీంతో బస్సులో ఉన్న సుమారు 26 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. అందరూ చూస్తుండగానే మంటలు బస్సు (Bus fire accident) మొత్తానికి వ్యాపించాయి. 


Also read : AP, Telangana weather forecast: తెలంగాణ, ఏపీకి వర్షసూచన.. మరో రెండు రోజులు తప్పని Heavy rains


ఫైర్ ఇంజన్‎కు సమాచారం అందించినప్పటికీ.. అప్పటికే ఆలస్యం అవడంతో బస్సు మంటల్లో (Bus catches fire on road) చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.


Also read : Man tried to set APSRTC bus on fire: ప్రయాణికులతో ఉన్న ఆర్టీసీ బస్సుకు నిప్పంటించాడు


Also read : AP Three Capital Issue: మూడు రాజధానులతో కేంద్రానికి సంబంధం లేదు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook