Man tried to set APSRTC bus on fire: ప్రయాణికులతో ఉన్న ఆర్టీసీ బస్సుకు నిప్పంటించాడు

Man tried to set APSRTC bus on fire: ప్రయాణికులతో నిండి ఉన్న ఆ బస్సు ముందు భాగంలో పెట్రోల్‌ పోశాడు. ఏడుకొండలు వింత ప్రవర్తన చూసి అతడు ఏం చేస్తున్నాడో అర్థం చేసుకున్న స్థానికులు అతడిని వారించబోయారు. కానీ ఈలోపే ఏడుకొండలు ఆ బస్సుకు నిప్పంటించాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 14, 2021, 05:23 PM IST
Man tried to set APSRTC bus on fire: ప్రయాణికులతో ఉన్న ఆర్టీసీ బస్సుకు నిప్పంటించాడు

Man tried to set APSRTC bus on fire: కనిగిరి: ప్రయాణికులతో ఉన్న ఆర్టీసీ బస్సుకు ఓ యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం మొగులారుకు చెందిన రామగిరి ఏడుకొండలు అనే యువకుడు గురువారం ఉదయం కనిగిరి పట్టణానికి వచ్చాడు. కనిగిరి ఆర్టీసీ బస్ స్టేషన్‌కు (Kanigiri Bus stand) వెళ్లిన ఏడుకొండలు అక్కడ కనిగిరి నుంచి పామూరు వెళ్లే బస్సు వద్దకు చేరుకున్నాడు. అప్పటికే ప్రయాణికులతో నిండి ఉన్న ఆ బస్సు ముందు భాగంలో పెట్రోల్‌ పోశాడు. ఏడుకొండలు వింత ప్రవర్తన చూసి అతడు ఏం చేస్తున్నాడో అర్థం చేసుకున్న స్థానికులు అతడిని వారించబోయారు. కానీ ఈలోపే ఏడుకొండలు ఆ బస్సుకు నిప్పంటించాడు. 

అది గమనించిన స్థానికులు బిగ్గరగా అరుస్తూ ప్రయాణికులను దిగిపోవాల్సిందిగా కేకలు వేశారు. దీంతో ప్రయాణికులు వెంటనే బస్సులోంచి కిందకు దిగారు. మరోవైపు బస్సుకు మంటలు పూర్తిగా వ్యాపించకముందే ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులు, స్థానికుల సహాయంతో మంటలను ఆర్పివేశారు. మంటలు ఆర్పేసే క్రమంలోనూ ఏడుకొండలు బస్సులోకి ఎక్కి గట్టిగా అరుస్తూ అక్కడి వారిని భయబ్రాంతులకు గురిచేశాడు.

Also read : AP, Telangana weather updates: ఏపీ, తెలంగాణలో మరో 2 రోజులు భారీ వర్షాలు

ఈ ఘటనలో అదృష్టవశాత్తుగా అందరూ సమయస్పూర్తితో వ్యవహరించడంతో ఈ ఘటనలో బస్సుకు కానీ లేదా ప్రయాణికులకు (APSRTC passengers) కానీ ఎలాంటి నష్టం సంభవించలేదు.

ఏపీఎస్ ఆర్టీసీ సిబ్బంది (APS RTC Staff) ఇచ్చిన ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఏడుకొండలును అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కి తరలించారు. ఏడుకొండలు మానసిక పరిస్థితి సరిగా లేనందునే ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో వెల్లడైనట్టు సమాచారం.

Also read : AP Theatres : ఏపీ థియేటర్లలో వందశాతం సీటింగ్‌కు అనుమతి

Also read: Badvel bypoll updates: బద్వేలు ఉప ఎన్నికకు 15 మంది పోటీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News