Pushpa2 movie stampede at Sandhya theatre: పుష్ప2 మూవీ చూసేందుకు దిల్‌షుఖ్ నగర్ కు చెందిన రేవతి (39) తన భర్త భాస్కర్, ఇద్దరు పిల్లలు శ్రీ తేజ్ (9) , సన్వీక (7).. అశోక్ నగర్ లోని సంధ్య థియేటర్ కు వచ్చారు. అప్పటికే అక్కడ ఫుల్ క్రౌడ్ ఉన్నట్లు తెలుస్తొంది. అయితే.. సినిమా హల్ లోకి ప్రవేశించేందుకు వీరు ప్రయత్నించారు. అప్పటికే అక్కడ విపరీమైన జనాలు ఉన్నారు. ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో రేవతి, ఆమె కొడుకు శ్రీతేజ కింద పడిపోయారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిటనట్లు తెలుస్తొంది. దీంతో పోలీసులు బాలుడికి సీపీఆర్ చేసినట్లు తెలుస్తొంది. రేవతి మాత్రం స్పందించలేదని తెలుస్తొంది. వీరిని దుర్గాబాయ్ దేశ్ ముఖ్ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తొంది. అక్కడ రేవతి చనిపోయినట్లు ప్రకటించారు. కానీ బాలుడ్ని మాత్రం మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తరలించారు.


 



తాజాగా.. రేవతి భర్త.. నిన్న జరిగిన విషాదం గురించి మాట్లాడినట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. తన పిల్లలు, భార్యకు అల్లు అర్జున్ అంటే విపరీతమైన అభిమానమని.. అందుకే పుష్ప2 మూవీని ఫస్ట్ డే చూసేందుకు టికెట్ లు సైతం బుక్ చేసుకున్నామని చెప్పుకొవచ్చాడు. అప్పటికే సంధ్య థియేటర్ దగ్గర కొంచెం రద్దీ ఉంది.


కానీ.. ఎప్పుడైతే.. అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చాడో.. ఆయన్నుచూసేందుకు ఒక్కసారిగా అభిమానులు పరిగెత్తుకొని రావడంతో తొక్కిసలాట జరిగిందని చెప్పినట్లు తెలుస్తొంది. తన భార్య, పిల్లలు అక్కడ తొపులాటలో కింద పడిపోయారని.. చెప్పారు.  అదే విధంగా పోలీసులు తన బాబుకు సీపీఆర్ చేయడం వల్ల బతికాడని చెప్పుకొవచ్చాడు. కానీ తన భార్యను కోల్పోయానని కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తొంది.


Read more: Pushpa2 stampede: అల్లు అర్జున్‌పై కేసు నమోదు..?.. మహిళ దుర్మరణం, బాలుడు సీరియస్ ఘటనలో సంచలన డిమాండ్..


ఇదిలా ఉండగా.. ఈ ఘటనకు ఇన్ డైరెక్ట్ గా అల్లు అర్జున్ కారణమని కూడా .. ఆయనపై కేసులు నమోదు చేయాలని రేవతిబంధువులు, పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో దీనిపై అల్లుఅర్జున్ టీమ్ స్పందించినట్లు తెలుస్తొంది. మహిళ కుటుంబానికి, బాలుడికి అండగా ఉంటామని చెప్పారని తెలుస్తొంది. కానీ అల్లు అర్జున్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook