Naga Shauryas father farm house case : హీరో నాగశౌర్య తండ్రికి నోటీసులు.. ఫాంహౌస్‌లో పేకాటపై ముమ్మర దర్యాప్తు
Police sends notice to Naga Shauryas father Ravindra Prasad:ఈ కేసులో ఫాంహౌస్‌ను లీజ్‌కు తీసుకున్న సినీనటుడు నాగశౌర్య తండ్రి పేరు ప్రధానంగా వార్తల్లో నిలిచింది. బర్త్‌డే వేడుక కోసం ఒకరోజుకు అద్దెకు ఫాంహౌస్‌ను సుమన్‌కు ఇచ్చినట్లు తెలుస్తోంది.
Raids at tollywood hero Naga Shauryas father leased farm house police sends notice to Ravindra Prasad: రంగారెడ్డి జిల్లా మంచిరేవుల వద్ద ఫాంహౌస్‌లో పేకాట కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు, ఏపీకి చెందిన గుత్తా సుమన్‌తో (Gutta Suman) పాటు మరో 30 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
అయితే ఈ కేసులో ఫాంహౌస్‌ను లీజ్‌కు తీసుకున్న సినీనటుడు నాగశౌర్య తండ్రి (Naga Shaurya’s father) పేరు ప్రధానంగా వార్తల్లో నిలిచింది. బర్త్‌డే వేడుక కోసం ఒకరోజుకు అద్దెకు ఫాంహౌస్‌ను సుమన్‌కు (Suman) ఇచ్చినట్లు తెలుస్తోంది.
మరోవైపు విజయవాడలో గుత్తా సుమన్‌పై భూకబ్జా కేసు ఉన్నట్లు సమాచారం. ఏపీలో ఆయన చేపట్టే కార్యకలాపాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎన్జీవో (NGO) పేరుతో సుమన్ డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. అక్కడ ఆయన పలు స్థిరాస్తి మోసాలకు పాల్పడినట్లు నార్సింగి పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం. నిందితులంతా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.
ఈ కేసులో మొదట హీరో నాగశౌర్య బాబాయ్ పేరు కూడా బయటకు వచ్చింది. నాగ శౌర్య బాబాయ్ బుజ్జి (Naga Shourya Babai Bujji) పేరు బయటికి రావడం చర్చనీయాంశంగా మారింది. మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు ఫామ్‌హౌస్‌పై (Farmhouse) దాడి చేయగా.. పేకాట రాయుళ్లు పట్టుబడ్డారు. నార్సింగ్ పోలీస్టేషన్ పరిధిలోని మంచిరేవుల (Manchirevula) ప్రాంతంలో గ్రీన్‌ల్యాండ్స్ కాలనీలో ఈ ఘటన జరిగింది.
గుత్తా సుమన్ (Gutta Suman) ఫోన్‌ను, కాల్ డేటాను అనలైజ్ చేస్తుంటే విస్తుబోయే విషయాలు బయటపడుతున్నాయి. సుమన్ ఈ ఒక్క ఫామ్‌హౌస్‌లోనేకాదు.. శివారుల్లోని వేర్వేరు ఏరియాల్లో వేర్వేరు ఫామ్‌హౌసుల్లో క్యాసినో ఆడిపిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతీ ఫామ్‌హౌస్‌కీ (Farmhouse) ఒక్కో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసినట్లు సమాచారం. చిప్స్‌తో నడిచే ఈ దందాలో కార్డులు తెస్తే స్వైపింగ్ చేసుకోవచ్చు. కార్డు లేకపోతే లిక్విడ్ క్యాష్‌తో రావచ్చు. అందుకు కావాల్సిన సేఫ్టీ, సెక్యూరిటీ పక్కా అన్న భరోసాతో సుమన్ ఈ గేమ్‌ను నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తెలుస్తోంది.
Also Read : Australia Covaxin Approval: కొవాగ్జిన్ టీకాకు ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారిక గుర్తింపు
సుమన్ కుమార్ మొబైల్‌ను పోలీసులు సీజ్ చేశారు. అతని కాంటాక్ట్స్‌లో పలువురు వీఐపీ నంబర్లు ఉన్నట్లు గుర్తించారు. విజయవాడ, హైదరాబాద్‌కు చెందిన బడా వ్యాపారవేత్తలు, ప్రముఖుల ఫోన్ నంబర్లున్నట్టు గుర్తించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నేతలతో సుమన్ పరిచయాలు పెట్టుకున్నారు. ఇక కేసులో మాజీ ఎమ్మెల్యే శ్రీరాం భద్రయ్యను (Sriram Bhadraya) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యేగా భద్రయ్య పనిచేశారు. వాసవి డెవలపర్స్ రాజారాంతో సహా మరో రియల్టర్ మద్దుల ప్రకాష్ కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. విజయవాడలోని (Vijayawada) మామిడితోటలో సైతం గుత్తా సుమన్ పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read : Viral Video: ఈడు మగాడ్రా బుజ్జి.. పడగ విప్పిన పాముకు ముద్దు.. వహ్!
అయితే ఆ పేకాట వ్యవహారంతో తనకు ఏం సంబంధం లేదని. అది తన తండ్రి పేరు మీద ఉందని.. అక్కడ ఏం జరుగుతుందో తనకు తెలియదని నాగశౌర్య (Nagashourya) చెప్పినట్లు సమాచారం.
నాగ శౌర్య తండ్రి రవీంద్ర ప్రసాద్‌కు (Ravindra Prasad) పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని సూచించారు. అయితే రవీంద్ర ప్రసాద్.. విల్లాను గుట్ట సుమన్ చౌదరి ఒకరోజుకి అద్దెకు తీసుకున్నట్లు చెబుతున్నారు. రెంటల్ అగ్రిమెంట్‌తో పాటు లీజ్ అగ్రిమెంట్‌తో ఆయన పోలీసుల విచారణకు హాజరుకానున్నారు.
Also Read : Diwali 2021: బెంగళూరులో దీపికా దీపావళి సంబరాలు, చిన్ననాటి జ్ఞాపకాలు