Ram Gopal Varma Tweets On KA Paul: కేఏ పాల్‌ పై రాంగోపాల్‌ వర్మ ట్వీట్ల వర్షం కురిపించాడు. పాల్‌ పై జరిగిన దాడి ఘటనను కోట్‌ చేస్తూ వరుసగా పదికిపైగా ట్వీట్లు చేశాడు. నిజంగానే పాల్‌ పై దాడి జరిగిందా లేక అంతా సెటప్‌ అని ట్విట్టర్‌ లో ప్రశ్నించాడు ఆర్జీవీ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు రాష్ట్రాల్లో ఏ చిన్న ఘటన జరిగినా వెంటనే స్పందించే మొట్టమొదటి వ్యక్తి రామ్‌ గోపాల్‌ వర్మ.ట్విట్టర్‌ లో యాక్టివ్‌ గా ఉండే ఆర్జీవీ.. కేఏ పాల్‌ పై జరిగిన దాడి మీద కూడా తనదైన శైలిలో స్పందించారు. పాల్‌ ను టార్గెట్‌ చేస్తూ వరుస ట్వీట్లు చేశాడు. జీసస్‌ పేరును ప్రస్తావిస్తూ వర్మ.. ట్విట్టర్‌ లో ఎటాకింగ్‌ కు దిగాడు. సానుభూతి పొందేందుకే కేఏ పాల్‌ మనిషిని సెట్‌ చేసుకుని మరి తనపై దాడి చేయించుకున్నాడా అని  ఆర్జీవీ ట్విట్‌ చేశాడు. దీనికి కేఏ పాల్‌ కూడా స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఈ ట్వీట్‌ చేయడానికి నువ్వు కేటీఆర్‌ దగ్గర ఎంత తీసుకున్నావు అని ప్రశ్నించారు. ఆ తర్వాత వర్మ వరుసగా ట్వీట్ల వర్షం కురిపించాడు. అయితే తొలి ట్వీట్‌ కు కౌంటర్‌ ఇచ్చిన ఆర్జీవీ ఆ తర్వాత వర్మ చేసిన ఏ ట్వీట్‌ కు కూడా స్పందించలేదు.


పాల్‌ ను అంత పెద్ద మనిషి కొడితే చెంపపై చిన్న మరక కూడా లేదన్నాడు వర్మ. ఇది సినిమాటిక్‌ ఓవర్‌లాప్‌ దెబ్బనా.. లేక కేఏ పాల్‌  స్కిన్‌ మందంగా ఉందా అని ట్విట్‌ చేశాడు. 
ఒక వేళ కే ఏ పాల్ ను కొట్టింది నిజమైతే.. సాధారణ జనంలా పోలీసులపై ఆధారపడకుండా.. కొట్టిన వ్యక్తిపై పిడుగుపడేలా ఆ జీసస్‌ ను కోరేవాడేని సెటైరికల్‌ ట్వీట్‌ చేశాడు. 
అంతేకాదు కేఏ పాల్‌ పై మరో దెబ్బ పడకుండా పోలీసులు కాపాడినందుకు వాళ్లకు ప్రభువు దీవనెలు ఇవ్వాలన్నాడు. కేఏ పాల్ జీసస్‌ కు ఎందుకు ట్విట్‌ చేయలేదు. అలా చేసి ఉంటే జీసస్‌ దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ పోలీసులకు రీట్వీట్‌ చేసేవాడు కదా అని ప్రశ్నించాడు. జీసస్‌ ను వేలాడదీసినప్పుడైనా నేను బాధపడేలేదుకానీ.. కేఏ పాల్‌ ను కొట్టినప్పుడు మాత్రం మానసికంగా ఎంతో వేదనకు గురయ్యానని వర్మ తన ట్విట్టర్‌ వేదికగా చెప్పుకొచ్చాడు. 


కేఏపాల్‌ కూడా జీసస్‌ లాగా తనను కొట్టినవారిని క్షమించి వదిలేయాలని చెప్పాడు. జీసస్‌ కూడా పోలీసులకు కంప్లైంట్‌ చేసి ఉంటే అతను జీసస్‌ కాకపోయి ఉండేవాడన్నాడు వర్మ. 
సాధారణ పోలీసుల సాయం తీసుకుని జీసస్‌ ను అవమానించొద్దు అని పాల్‌ కు వర్మ సూచించాడు.తనపై దాడి చేసిన వ్యక్తిని జీసస్‌ కు చెప్పి దహనం చేపించేయ్‌ అన్నాడు ఆర్జీవీ.
నీ లక్ష్యం తెలంగాణ ప్రజలకు సేవ చేయడమే అయితే... ఓట్లు అడిగే బదులు జీసస్‌ కు చెప్పి ప్రతి ఓటరుకు కోటి రూపాయలు ఇవ్వమని చెప్పమన్నాడు. నిన్ను, నీ డార్లింగ్‌ ఎవండర్‌ హోలీ ఫీల్డ్‌ ను ప్రేమించే  27 దేశాల నియంతలకు, ఆ జీసస్‌కు చెప్పి నన్ను, నిన్ను కొట్టినవ్యక్తిని కొట్టమని చెప్పమన్నాడు ఆర్జీవీ. మొత్తంగా వర్మ కేఏ పాల్‌ ను ఓ ఆట ఆడుకున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నాడు. వర్మతో పెట్టుకుంటే మాములుగా ఉండదంటున్నారు.


 


Also Read: Sai Pallavi Marriage: సినిమాలు చేయకపోతే.. పెళ్లి చేసేస్తారా! ఆ వార్తలు ఎంత బాధిస్తాయో తెలుసా?


Also Read: హృతిక్‌ రోషన్‌ చేసిన పనికి నా హృదయం ముక్కలైపోయింది.. స్టార్ హీరోయిన్ ఆవేదన!


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook