Sri Rama Navami: వెల్లివిరిసిన మతసామరస్యం.. దర్గాలో సీతారాముల కల్యాణం ముస్లింల పూజలు
Sri Rama Navami Celebrations In Dargah Muslims Participated: శ్రీరామనవమి వేడుకల్లో ముస్లింలు పాల్గొని మత సామరస్యాన్ని చాటారు. వాళ్లు ప్రార్థనలు చేసే దర్గాలో సీతారాముల కల్యాణం జరిపించి దేశానికే ఆదర్శంగా నిలిచారు.
Sri Rama Navami In Dargah: దేశవ్యాప్తంగా హిందూ ప్రజలు అత్యంత ఆనందోత్సాహాల మధ్య శ్రీరామ నవమిని చేసుకున్నారు. సీతారాముల కల్యాణాన్ని కళ్లారా చూసి తరించారు. అయితే పలుచోట్ల మత సామరస్యం వెల్లివిరిసింది. తెలంగాణలో ముస్లింలు సీతరాముల కల్యాణం జరిపించడం విశేషం. అది కూడా అక్కడా ఇక్కడా కాదు వారి దర్గాలోనే సీతారాముల వివాహం జరిపించి మత సామరస్యాన్ని చాటి చెప్పారు. ఈ వేడుకలో ముస్లింలతోపాటు హిందూవులు కూడా పాల్గొన్నారు.
Also Read: Bhadrachalam: జానకిని పెళ్లాడిన రామయ్య.. భద్రాచలంలో కల్యాణ వైభోగం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల సత్యనారాయణపురంలో శ్రీరామనవమి వేడుకలు ప్రత్యేకంగా జరిగాయి. గ్రామంలోని హజ్రత్ నాగుల్ మీరా మౌలచాన్ దర్గా షరీఫ్‌లో ముస్లింలు శ్రీరామనవమి వేడుకలు జరిపారు. మతాలకతీతంగా హిందూ ముస్లిం ప్రజలు ఈ వేడుకకు తరలివచ్చారు. ఈ వేడుకల కోసం దర్గాను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. వారం రోజుల ముందు నుంచే వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హోమాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇక నవమి రోజు బుధవారం సీతా రాముల కల్యాణాన్ని హిందూవులతోపాటు ముస్లింలు పాల్గొని జరిపించారు.
Also Read: Sri Rama Navami 2024: ఒంటిమిట్ట రాములోరి కల్యాణం చూతము రారండి .. బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ఇదే..
ఈ గ్రామంలోని దర్గాలో సీతారాముల కల్యాణం జరిపించడం ఇది తొలిసారి కాదు. దశాబ్ద కాలంగా దర్గాలో శ్రీరామ నవమి వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలే కాదు కార్తీక మాసంలో వచ్చే తొలి అమావాస్య రోజు ఉర్సు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ వేడుకలో కూడా హిందూముస్లింలు భారీ సంఖ్యలో పాల్గొంటారు. మత సామరస్యానికి సత్యనారాయణపురం వేదికగా నిలుస్తోంది. ఇతర గ్రామాలకు ఆదర్శరంగా ఉంటోంది. గ్రామాభివృద్ధిలో కూడా ఈ గ్రామస్తులు ఐకమత్యంగా ఉంటారు. అన్ని పండుగలు కలిసి చేసుకుంటూ దేశానికే ఆదర్శంగా సత్యనారాయణపురం గ్రామస్తులు నిలుస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter