Revanth Reddy MLAs Meet: ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో రేవంత్‌ రెడ్డి అప్రమత్తమయ్యారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌ రెడ్డి తిరిగి బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరడంతో ఖంగుతిన్న రేవంత్‌ మిగిలిన ఎమ్మెల్యేలు చేజారకుండా జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో రేవంత్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ ఎమ్మెల్యేల డిమాండ్లు, వారి అవసరాలు తీరుస్తామని భరోసా ఇచ్చేందుకు సమావేశమైనట్లు తెలుస్తోంది. గులాబీ పార్టీ ఘర్‌ వాపసీలో వ్యూహంలో ఎమ్మెల్యేలు పడకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టారు.
Also Read: Constable Aspirants: అర్ధరాత్రి మళ్లీ నిరుద్యోగుల ఆందోళన.. దిల్‌సుఖ్‌నగర్‌ దిగ్బంధం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పార్టీలో చేరిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఘర్‌ వాపసీ అంటారని.. నలుగురు ఎమ్మెల్యేలు గులాబీ పార్టీ వైపు మళ్లీ వెళ్తారనే ప్రచారం నేపథ్యంలో రేవంత్‌ రెడ్డి మేల్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు, గవర్నర్‌ ప్రమాణస్వీకారం ముగిసిన వెంటనే ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్‌లో చేరిన 9 మంది ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని మాజీ స్పీకర్, బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇచ్చిన విందుకు రేవంత్‌ హాజరయ్యారు.


Also Read: KTR Fire On Revanth: సీఎం కుర్చీలో రేవంత్‌ రెడ్డి అన్‌ఫిట్‌.. కండకావరంతో అసభ్య వ్యాఖ్యలు


బుజ్జగింపులు
ఈ విందుకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ దీపాదాస్ మున్షి తదితరులు హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి మినహా కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. వారితో రేవంత్‌ సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. మీకు న్యాయం చేస్తామని.. పదవులు, కాంట్రాక్ట్‌లు వంటి హామీలు ఇచ్చినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు చెప్పిన వారికే పదవులు వంటివి హామీ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.

పార్టీ మారొద్దని విజ్ఞప్తి
మళ్లీ బీఆర్‌ఎస్‌ పార్టీలోకి చేరద్దని రేవంత్‌ బతిమిలాడినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. వేరే నిర్ణయం తీసుకోవద్దని.. కాంగ్రెస్‌లో కొనసాగాలని మున్షీ తదితరులతో రేవంత్‌ హామీ ఇప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. బండ్ల కృష్ణ మోహన్‌ తొందరపడి వెళ్లిపోయాడని.. మీరు అలా చేయొద్దని చెప్పినట్లు తెలుస్తోంది. అసంతృప్తితో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్‌ ఇచ్చిన హామీలతో కొంత మెత్తబడినట్లు సమాచారం. తిరిగి బీఆర్‌ఎస్‌ పార్టీలోకి వెళ్లబోమని హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.


హాజరైన ఎమ్మెల్యేలు వీరే..


  • పోచారం శ్రీనివాస్‌ రెడ్డి- బాన్సువాడ

  • అరికపూడి గాంధీ - శేరిలింగంపల్లి

  • ప్రకాష్ గౌడ్- రాజేంద్రనగర్‌

  • గూడెం మహిపాల్ రెడ్డి- పటాన్‌చెరు

  • కడియం శ్రీహరి- స్టేషన్‌ ఘన్‌పూర్‌

  • కాలె యాదయ్య- చేవెళ్ల

  • డాక్టర్ సంజయ్ కుమార్‌

  • తెల్లం వెంకట్రావు- భద్రాచలం

  • దానం నాగేందర్- ఖైరతాబాద్‌


ఎమ్మెల్సీలు


  • భాను ప్రసాద్

  • బసవరాజు సారయ్య

  • దండె విఠల్

  • బొగ్గారపు దయానంద్

  • యెగ్గే మల్లేశం

  • ఎంఎస్ ప్రభాకర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter