Medaram Jathara 2024: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో అతిముఖ్యమైన రూ.2 లక్షల పంట రుణమాఫీని అమలు చేస్తామని మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. కొడంగల్‌ సభలో చేసిన వ్యాఖ్యలే మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రాంగణంలో చెప్పారు. త్వరలోనే పంట రుణమాఫీని చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. రుణమాఫీపై అధికారులు కసరత్తు ప్రారంభించారని తెలిపారు. త్వరలోనే మీ అందరికీ శుభవార్త చెప్పబోతున్నట్లు వెల్లడించారు. ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చకుండా ఉండమని స్పష్టం చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Basara IIIT Student: బావ లేని బతుకు నాకొద్దు.. తనని కాల్చిన చోటే నన్ను కాల్చండి


మేడారంలో సమ్మక్క, సారక్క కొలువుదీరడంతో శుక్రవారం తల్లులను రేవంత్‌ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. అనంతరం మేడారం సమీపంలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ గ్యారంటీలను ఈనెల 27వ తేదీన ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ పథకాల ప్రారంభోత్సవానికి ప్రియాంకా గాంధీ హాజరవుతారని వెల్లడించారు.

Also Read: RX 100 Bike: గుడ్‌న్యూస్‌.. మళ్లీ రానున్న 'యమహా ఆర్‌ఎక్స్‌ 100'.. ఫీచర్స్, ధర వివరాలు ఇవే


ఇక మేడారం జాతీయ పండుగగా గుర్తించడంపై స్పందిస్తూ.. ' మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించడం సాధ్యం కాదని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ప్రకటించడం సరికాదు. కుంభమేళాను కేంద్రం జాతీయ పండుగగా గుర్తించింది. మరి దక్షిణాది కుంభమేళా మేడారం జాతరకు కేవలం రూ.3 కోట్లు కేటాయించడం చూస్తుంటే తెలంగాణను నిర్లక్ష్యం చేయడమే. అయోధ్యలో రాముడిని దర్శించుకున్నట్టు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌ షా మేడారం జాతరను సందర్శించాలి. కేంద్రం ఉత్తర, దక్షిణ భారతం అటూ వివక్ష చూపడం మంచిది కాదు' అని హితవు పలికారు.


మరోసారి బీఆర్‌ఎస్‌ పార్టీ, బీజేపీపై రేవంత్‌ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. 'మాజీ సీఎం కేసీఆర్‌ అవినీతిపై సీబీఐకి ఇవ్వాలని బీజేపీ కోరుతోంది. పదేళ్లుగా ఉన్న కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆ రెండూ పార్టీలు కలిసే పోటీ చేస్తాయి. జర్నలిస్టుల సమస్యలను కూడా పరిష్కరిస్తాం' అని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు శక్తిమేర కృషి చేస్తున్నామని తెలిపారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి