Revanth Reddy Arrest: రేవంత్ రెడ్డి అరెస్ట్.. ఊసరవెల్లి ఫోటోతో కేసీఆర్‌కు బర్త్ డే విషెస్..
Police arrests TPCC Chief Revanth Reddy: తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Police arrests TPCC Chief Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇవాళ కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో రేవంత్‌ను ముందస్తు అరెస్ట్ చేశారు. అటు గాంధీ భవన్ వద్ద కూడా పోలీసులను భారీగా మోహరించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ శ్రేణులు ఎటువంటి ర్యాలీలు చేపట్టకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు.
రేవంత్ అరెస్ట్ సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల జులుం నశించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోని రేవంత్ తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. అదే ట్వీట్‌లో సీఎం కేసీఆర్ వైఖరిని ఎండగట్టారు. 'కేసీఆర్ తన నీడకు కూడా భయపడుతాడు. కేసీఆర్ తన పుట్టినరోజు జరుపుకునేందుకు వీలుగా వరుసగా రెండో రోజు కూడా నన్ను అరెస్ట్ చేశారు. ఓవైపు నిరుద్యోగ యువత ప్రాణాలు తీసుకుంటుంటే.. పుట్టినరోజులు జరుపుకోవడానికి ఇదేనా సమయం..' అంటూ రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను ప్రశ్నించారు.
అంతకుముందు, కేసీఆర్ పుట్టినరోజుపై రేవంత్ రెడ్డి ట్విట్టర్‌లో వ్యంగ్యంగా స్పందించారు. ఊసరవెల్లి ఫోటోతో పుట్టిన రోజు శుభాకాంక్షలు అని పోస్టు చేశారు. కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ రేవంత్ చేసిన ఈ ట్వీట్‌పై టీఆర్ఎస్ మద్దతుదారులు ఫైర్ అవుతున్నారు. మరోవైపు, కాంగ్రెస్ మద్దతుదారులు రేవంత్ ట్వీట్‌ను సమర్థిస్తున్నారు.
కాగా, నిన్ననే (ఫిబ్రవరి 16) రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అసోం సీఎం చేసిన వ్యాఖ్యలకు ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ ఆ పార్టీ మంగళవారం నిరసనలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు. తాజాగా సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నిరసనలకు సిద్ధమవడంతో మరోసారి రేవంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read : Warning for Whatsapp Users: వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక.. రెడ్ హార్ట్ ఎమోజీ పంపితే జైలుకే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook