Revanth Reddy Arrest: తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని బుధవారం పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆయన ఇంటి చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి రేవంత్ ను బయటకు రానివ్వకుండా చేశారు. ఇటీవలే కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీపై అస్సోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయమై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.
అయితే రేవంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు కేసుగా నమోదు చేయలేదు. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ వద్ద బుధవారం ఆందోళన చేపట్టేందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. ఆ విషయాన్ని తెలుసుకున్న పోలీస్ యంత్రాంగం ముందుగా రేవంత్ రెడ్డిని ఇంటికే పరిమితం చేసి.. హౌస్ అరెస్ట్ చేశారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేసినా కాంగ్రెస్ శ్రేణులు మాత్రం పట్టు విడువలేదు. రాష్ట్రవ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్ల వద్ద ధర్నాలకు యత్నించారు. వారిని కూడా పోలీసులు ఎక్కడికక్కడ గృహనిర్బంధాలు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేతలైన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా పలువురు నాయకులను పోలీసులు నిరసన చేయకుండా అడ్డుకున్నారు.
Also Read: Medaram Jatara: నేటి నుంచి మేడారం జాతర ప్రారంభం.. భక్తుల కోసం భారీ ఏర్పాట్లు!
Also Read: Kishan Reddy fires on Kcr: సీఎం కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook