Revanth Reddy on Venkatramireddy: మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
Revanth Reddy on Venkatramireddy: అందరు ముఖ్యమంత్రులను బుట్టలో వేసుకున్న ఘనుడు వెంకట్రామిరెడ్డి అని రేవంత్ రెడ్డి విమర్శించారు. సీఎంలకు వేల కోట్ల రూపాయలు సంపాదించి పెట్టడం వంటి నైపుణ్యం వెంక్రటామిరెడ్డిలో ఉందన్నారు.
Revanth Reddy on Venkatramireddy: నిన్నటిదాకా సిద్ధిపేట కలెక్టర్‌గా ఉన్న వెంకట్రామిరెడ్డి (Venkatramireddy) ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ కాబోతున్న సంగతి తెలిసిందే. వెంకట్రామిరెడ్డి రాజీనామా ప్రకటించడం... ప్రభుత్వం వెంటనే ఆమోదించడం... ఆ మరుసటిరోజే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో వెంకట్రామిరెడ్డిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. ముఖ్యమంత్రులను మెప్పించి ప్రమోషన్స్ పొందడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. వెంకట్రామిరెడ్డి రాజీనామాను ఆమోదించడానికి వీల్లేదని... ఆయన ఎమ్మెల్సీ నామినేషన్‌ను తిరస్కరించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అందరు ముఖ్యమంత్రులను బుట్టలో వేసుకున్న ఘనుడు వెంకట్రామిరెడ్డి అని రేవంత్ రెడ్డి విమర్శించారు. గతంలో చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల హయాంలో వెంకట్రామిరెడ్డి అవినీతికి పాల్పడ్డారని రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ కాళ్లు మొక్కి ఆయన ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నాడన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వెంకట్రామిరెడ్డిపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయన్నారు. అప్పట్లో హరీశ్ రావు (Harish Rao) సైతం వెంకట్రామిరెడ్డిపై ఆరోపణలు చేశారన్నారు.
Also Read: MP Dharmapuri Arvind : వేములవాడ ఉప ఎన్నిక వస్తుంది.. భారీ కుంభకోణం బయటపడ్తది
కోర్టు ఉల్లంఘన కేసులున్న వెంకట్రామరెడ్డి రెడ్డి.. టీఆర్ఎస్‌కు బంట్రోతుగా మారి పనిచేశాడని రేవంత్ రెడ్డి విమర్శించారు.ఉమ్మడి రాష్ట్రంలోని సీఎంలకు అత్యంత ప్రీతిపాత్రుడైన వెంకట్రామిరెడ్డిని ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్‌గా కేసీఆర్ (CM KCR) నియమించారని అన్నారు. సీఎంలకు వేల కోట్ల రూపాయలు సంపాదించి పెట్టడం వంటి నైపుణ్యం వెంక్రటామిరెడ్డిలో ఉందన్నారు. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ వెంకట్రామిరెడ్డిపై (Venkatramireddy) సీఎస్ నుంచి రాష్ట్రపతి వరకు లేఖలు రాసినా చర్యలు తీసుకోలేదన్నారు. వెంకట్రామిరెడ్డికి చెందిన రాజ్ పుష్పా సంస్థ కోకాపేట భూములను దక్కించుకుందన్నారు. అందులో రూ.1వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందన్నారు.వెంకట్రామిరెడ్డి రాజీనామా చేయగానే కేసీఆర్ ఆయన్ను ఎమ్మెల్సీ చేశాడని... రేపో మాపో ఆర్థికమంత్రిగా కూడా నియమిస్తారనే ప్రచారం జరుగుతోందని రేవంత్ అన్నారు. ఇలాంటివాళ్ల కోసమేనా తెలంగాణ వచ్చింది... తెలంగాణ ద్రోహులను పాలకులుగా నియమించడమేంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook