TRS MLC Candidates: ఎమ్మెల్యే కోటా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే...

TRS MLC Candidates : టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను  (Telangana MLC Elections 2021) ఎట్టకేలకు ఖరారు చేశారు. ఊహించినట్లే మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, అనూహ్యంగా రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ పేర్లను కేసీఆర్ ఖరారు చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 16, 2021, 12:51 PM IST
  • ఎమ్మెల్యే కోటా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు
    అనూహ్యంగా రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్‌కు చోటు
    ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు తప్పని భంగపాటు
TRS MLC Candidates: ఎమ్మెల్యే కోటా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే...

TRS MLC Candidates : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను టీఆర్ఎస్ అధిష్టానం ఖరారు చేసింది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్‌ పేర్లను ఖరారు చేశారు. మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎస్సీ కమిషన్ మాజీ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ల పేర్లు కూడా ఎమ్మెల్సీ రేసులో (Telangana MLC Elections 2021) వినిపించినప్పటికీ... అనూహ్యంగా చివరి నిమిషంలో బండా ప్రకాశ్ పేరును కేసీఆర్ ఫైనల్ చేశారు.

తాజాగా ఖరారైన ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ముగ్గురు రెడ్లు, ఒక వెలమ, ఒక బీసీ, ఒక ఎస్సీ సామాజికవర్గానికి చెందిన నేతలు ఉండటం గమనార్హం. బండా ప్రకాశ్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయనకు ఇంకా రెండున్నరేళ్ల పదవీ కాలం ఉంది. అయినప్పటికీ ఆయన్ను ఎమ్మెల్సీ చేయాలనుకోవడంలో ఆంతర్యమేంటన్నది చర్చనీయాంశంగా మారింది. బండా ప్రకాశ్ ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన కావడంతో... బహుశా ఈటల రాజేందర్ (Etela Rajender) స్థానంలో ఆయనకు మంత్రి పదవి దక్కవచ్చుననే ప్రచారం జరుగుతోంది. 

Also Read: Corona Update in India:భారీగా తగ్గిన కరోనా కేసులు.. గడిచిన 287 రోజుల్లో ఇదే అత్యల్పం

ఇక ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు భంగపాటు తప్పలేదు. హరీశ్ రావుకు (Harish Rao) అత్యంత సన్నిహితుడిగా పేరున్న శ్రీనివాస్ పేరును స్వయంగా హరీశే కేసీఆర్‌కు సిఫారసు చేశారు. చివరి నిమిషం వరకూ శ్రీనివాస్‌కు ఎమ్మెల్సీ ఖాయమనేనన్న ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా తుది జాబితాలో ఆయన పేరు లేకుండా పోయింది. నామినేషన్లకు మంగళవారమే( నవంబర్ 16) చివరి రోజు కావడంతో కేసీఆర్ అభ్యర్థులను ఖరారు చేశారు. మధ్యాహ్నం 3గంటల లోపు టీఆర్ఎస్ అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అనంతరం సాయంత్రం 4గంటల సమయంలో తెలంగాణ భవన్‌లో జరిగే టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థులను శాసనసభాపక్షానికి కేసీఆర్ (CM KCR) పరిచయం చేయనున్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో అనుసరించాల్సిన వైఖరిపై పార్టీ నేతలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News