Revanth Reddy on Arvind Kumar: ఓఆర్ఆర్ లీజుకు సంబంధించిన వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ మే 25న  తనకు ఇచ్చిన లీగల్‌ నోటీసులను వెనక్కి తీసుకోకుంటే ఆయనపై సివిల్‌, క్రిమినల్‌ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. ఓఆర్ఆర్ లీజుకు సంబంధించిన వ్యవహారంలో అరవింద్ కుమార్ పంపిన లీగల్ నోటీసుకు రేవంత్‌ తన అడ్వకేట్ ద్వారా రిప్లై పంపించినట్లు వెల్లడించారు. ఒక ఐఏఎస్ అధికారిగా కీలక పదవిలో ఉన్న అరవింద్ కుమార్.. ఆ రూల్స్ పాటించకుండా  అడిగిన సమాచారం ఇవ్వకుండా ఫక్తు రాజకీయ నాయకుడిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"అరవింద్ కుమార్ అధికారి పార్టీ తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నారు. నెహ్రూ ఓఆర్ఆర్ సగం భాగం నేను ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న మాల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. అధిక ఆదాయం వచ్చే ఆస్కారం ఉన్..నా ఆ దిశగా అలోచన చేయకుండా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి కేవలం రూ.7380 కోట్లకే ఐఆర్బీ సంస్థకు 30 ఏళ్లకు ఓఆర్ఆర్ టోల్ వసూలు టెండర్ కట్టబెట్టారు. అంతేకాకుండా ఐఆర్బీ టెండర్ కట్టబెట్టే క్రమంలో అన్ని నిబంధనలు యాదేచ్ఛగా ఉల్లంఘించారు. హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ 2031తో ముగుస్తుంది. 


30 ఏళ్లకు లీజుకు ఇస్తే.. 2031 తర్వాత మాస్టర్ ప్లాన్ మారుతుంది. దాంతో సమస్యలు వస్తాయి. అంతేకాకుండా దేశంలో ఏ రహదారి టెడంర్ అయిన 15-20 ఏళ్లకు మించి ఇవ్వలేదు. 30 ఏళ్ల సుదీర్ఘ కాలానికి కాకుండా 15-20 ఏళ్ల వరకే టెండర్ వ్యవధి ఉండాలని నేషనల్ హైవేస్ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) సూచించింది. అయినా ఎన్‌హెచ్ఏఐ అభ్యంతరాలను కూడా లెక్క చేయకుండా 30 ఏళ్లకు టెండర్ కట్టబెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఐఏఎస్ అధికారి స్థానంలో ఒక రిటైర్డ్ ఆఫీసరును నియమించి ఓఆర్ఆర్ టెండర్ టెండర్ ప్రక్రియను పూర్తి చేశారు.." అని రేవంత్ రెడ్డి అన్నారు. 


టెండర్ ప్రక్రియ కొనసాగుతుండగానే హెచ్‌జీసీఎల్ (హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్) స్థానంలో హెచ్ఎండీఎను తీసుకొచ్చారని ఆయన తెలిపారు. అంతేకాదు ఓఆర్ఆర్ టెండర్‌కు సంబంధించిన బేస్ ప్రైస్ ఎంతో వెల్లడించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన అరవింద్ కుమార్ నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు. ఓఆర్ఆర్‌పై ట్రాఫిక్, టెండర్ విలువను మదింపు చేసిన మజర్స్ నివేదికను కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టడం లేదని అన్నారు. ఇవన్నీ టెండర్ల ప్రక్రియలో ఏదో జరిగిందనే అనుమానాలకు బలం చేకూరుస్తుందని పేర్కొన్నారు. 


ఈ నేపథ్యంలో ఒక ప్రజాప్రతినిధిగా సంబంధిత వ్యవహరంపై స్పందించాల్సిన బాధ్యత తనపై ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్టీఐ ద్వారా తెలుసుకోవడానికి వెళ్తుంటే ఒక ప్రజాప్రతినిధిని అని కూడా చూడకుండా సచివాలయానికి వెళ్లకుండా అడ్డగించి అరెస్ట్ చేయించారని గుర్తు చేశారు. అడిగిన సమాచారానికి సమాధానం ఇవ్వకుండా అరవింద్ కుమార్ రాజకీయ నాయకుడి మాదిరిగా ఎదురు దాడికి దిగుతున్నారని అన్నారు. లీగల్ నోటీసులో తనపై పేర్కొన్న ఆరోపణలన్నీ బూటకమన్నారు. అరవింద్ కుమార్ పంపిన లీగల్ నోటీసు ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధని.. అధికార పార్టీ అక్రమాలపై ప్రశ్నిస్తున్నందుకుగాను అణిచివేసే క్రమంలో ఈ నోటీసు ఇచ్చినట్లు తోస్తుందన్నారు. తనకు నోటీసులిచ్చినా ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు.


Also Read: World Cup 2023 Schedule: ప్రపంచకప్‌లో టీమిండియా షెడ్యూల్ ఇదే.. పాక్‌తో మ్యాచ్‌ ఎప్పుడంటే..?  


Also Read: Cyclone Biparjoy: దూసుకువస్తున్న బిపోర్‌ జాయ్‌ తుఫాన్.. ఎఫెక్ట్ ఎక్కడంటే..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి