Telangana Investments: దావోస్ పెట్టుబడులన్నీ మేం తెచ్చిన ఘనతే: రేవంత్ రెడ్డి

Revanth Reddy List Out Of Davos Investments: తమ పాలనను చూసి పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి తెలంగాణలో పెట్టుబడి పెట్టారని రేవంత్ రెడ్డి తెలిపారు. 14 నెలల పాలనను చూసి పెట్టుబడులు భారీగా వచ్చాయని మీడియాకు వివరించారు.
Davos Investments: విదేశాల నుంచి వస్తున్న పెట్టుబడులన్నీ తమ ఘనత తమదేనని రేవంత్ రెడ్డి ప్రకటించారు. దావోస్ పెట్టుబడులపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పాలనను చూసి విదేశీ సంస్థలు, ప్రముఖ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని వెల్లడించారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇక్కడ అభివృద్హి చేసే పరిస్థితి ఏర్పడనుందని పేర్కొన్నారు.
Also Read: Mutton Biryani: పెళ్లి విందులో 'మటన్ బిర్యానీ' లొల్లి.. ఆగిపోయిన రిసెప్షన్ వేడుక
హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తమ 14 నెలల పాలనను చూసి పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందకువచ్చారని వివరించారు. 1.80 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చినట్లు ప్రకటించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇక్కడ అభివృద్హి చేసే పరిస్థితి ఏర్పడనుంది. అయితే కొంతమంది కుట్ర పన్ని అక్రమ సంపాదనతో ఏదో చేయాలనీ అనుకుంటున్నారు' అని ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.
Also Read: BRS Party MLA: బీఆర్ఎస్ పార్టీలోకి మరో ఫిరాయింపు ఎమ్మెల్యే? కీలక పరిణామంతో కన్ఫార్మ్
'ఇప్పుడే కాదు ఆనాటి పీవీ నరసింహ రావు నుంచీ మన్మోహన్ సింగ్ వరకు కాంగ్రెస్ సరికొత్త విధానాలతో ముందుకు వెళ్తోంది. 14 నెలల్లో రూ.లక్ష 70 వేల కోట్లకు పైగా రాబడులు తీసుకొస్తున్నాం. ఎన్నో దిగ్గజ కంపెనీలు వస్తున్నాయి' అని రేవంత్ రెడ్డి వెల్లడించారు. 'రాష్ట్రంపై నమ్మకంతో పెట్టుబడులు వస్తున్నాయి. మా పాలసీ విధానాలు నచ్చి ఎన్నో కంపెనీలు క్యూ కట్టాయి. 3 ట్రిలియన్స్ ఎకానమీ వైపు వెళ్లడం, ఉద్యోగ అవకాశాలు నెలకొల్పినప్పుడే సార్ధకత భావిస్తాం. ఏడాదిగా ఎన్నో విమర్శలు చేసినా పట్టించుకోం. మూసీ ప్రక్షాళన, నిరుద్యోగ శిక్షణ నైపుణ్యత పెంచేలా దృష్టి పెడుతున్నాం. స్కిల్స్ యూనివర్సిటీ వచ్చే ఇయర్ నుంచి టీచర్స్ కు ట్రయినింగ్ ఇవ్వబోతున్నాం. సింగపూర్ లోను ఒప్పందాలు చేసుకున్నాం. ఇలా వివిధ కంపెనీల ద్వారా 49 వేల మందికి అవకాశాలు వస్తాయి' అని శ్రీధర్ రెడ్డి ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.