KCR Arrest: అధికారంలో ఉన్న రేవంత్‌ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పాలన వ్యవహారాల కన్నా రాజకీయాలపై ప్రధాన దృష్టి సారించారు. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాక తరచూ ఢిల్లీ పర్యటనలు చేస్తూ.. బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ బిజీబిజీగా ఉన్నారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలపై పూర్తి దృష్టి ఉంచారు. దీంతోపాటు లోలోపల ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీని పూర్తిగా అణచివేసే భారీ ప్రణాళిక రచించినట్లు సమాచారం. అందులో భాగమే 'ఫోన్‌ ట్యాపింగ్‌' అంశం. గులాబీ పార్టీని దెబ్బతీసేందుకు ట్యాపింగ్‌ అస్త్రాన్ని రేవంత్‌ రెడ్డి బయటకు తీశారని చర్చ జరుగుతోంది. ముఖ్యంగా గులాబీ దళిపతి, మాజీ సీఎం కేసీఆర్‌ను రేవంత్‌ లక్ష్యంగా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తనను జైలుకు పంపిన కేసీఆర్‌ను తాను జైలు పంపించేందుకు రేవంత్‌ రెడ్డి ప్రణాళికలు వేస్తున్నట్లు సమాచారం. రేవంత్‌ రెడ్డి వ్యక్తిగత అజెండాతో పని చేస్తున్నట్లు పరిణామాలు కనిపిస్తున్నాయి. జాతీయ స్థాయిలో 'పార్టీ ఫిరాయింపులు' వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌ తెలంగాణలో మాత్రం ఫిరాయింపులకు పాల్పడుతోంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Tukkuguda Meeting: తుక్కుగూడ సభలో భట్టి విక్రమార్కకు అవమానం.. ఓవరాక్షన్ చేసిన సీపీ తరుణ్ జోషి..


అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌ మొత్తం కాంగ్రెస్‌ శాసనసభా పక్షాన్ని బీఆర్‌ఎస్‌లో విలీనం చేసుకున్నారు. ఇప్పుడు అదే మాదిరి రేవంత్‌ రెడ్డి చేస్తున్నారని కనిపిస్తోంది. ఇప్పటికే అధికారికంగా ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. మొత్తం 25 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోని బీఆర్ఎస్‌ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకోవాలని రేవంత్‌ ప్లాన్‌. ఇక రెండో ప్రణాళిక కేసీఆర్‌ను జైలుకు పంపడమే.

Also Read: KCR Polam Bata: రైతుల కన్నీరు తుడిచిన కేసీఆర్‌.. రూ.25 లక్షలకు డిమాండ్‌


అధికారంలో ఉన్న సమయంలో 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్‌ రెడ్డి డబ్బులు పంచుతూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబట్టారు. నాటి నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్సన్‌కు రేవంత్‌ రెడ్డి డబ్బులు ఇస్తూ దొరికిన విషయం తెలిసిందే. 'ఓటుకు నోటు' కేసులో ప్రధాన నిందితుడిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆ కేసులో అరెస్టయి రేవంత్‌ రెడ్డి జైల్లో ఉన్నారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసు వలన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణను ఏపీకి పరిమితమయ్యారు.


తనను జైలుకు పంపించడంపై రేవంత్‌ రెడ్డి తట్టుకోలేకపోతున్నారు. ఇది మనసులో పెట్టుకున్న రేవంత్‌ రెడ్డి ఇప్పుడు అధికారంలో ఉండడంతో కేసీఆర్‌పై అదే తీరిన కసి తీర్చుకునే అవకాశం కనిపిస్తోంది. ఇదే విషయాన్ని 'తుక్కుగూడ' సభలో రేవంత్‌ రెడ్డి చెప్పాడు. 'కేసీఆర్‌కు జైలు కూడు తినిపిస్తా. డబుల్‌ బెడ్రూమ్‌ చర్లపల్లి జైల్లో కట్టిస్తా' అని హెచ్చరించిన విషయం తెలిసిందే. కేసీఆర్‌ను జైలుకు పంపడం అనేది రాజకీయ విమర్శనే కాదు రేవంత్‌ రెడ్డి అజెండాగా కనిపిస్తోంది.


అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్‌పై రేవంత్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కేసీఆర్‌ను జైలుకు పంపించేందుకు ఉన్న మార్గాలు అన్వేషించి 'ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం' తెరపైకి తీసుకొచ్చారు. ఈ కేసులో ఇప్పటివరకు అధికారులను అరెస్ట్‌ చేసిన పోలీస్‌ శాఖ త్వరలోనే గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నాయకులను అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది. ట్యాపింగ్‌ కేసును కేసీఆర్‌ అరెస్ట్‌ దాకా తీసుకెళ్లేలా మాస్టర్‌ ప్లాన్‌ ఉంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలను బట్టి రేవంత్‌ రెడ్డి కేసీఆర్‌ అరెస్ట్‌ వ్యవహారం ఉంటుందని తెలుస్తోంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook