తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నేత రేవంత్ రెడ్డి సీఎం రేసులో ఉన్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఈ అంశంపై స్పందించారు. ప్రస్తుతానికి తాను సీఎం పదవి గురించి ఆలోచించడం లేదని..ప్రజా కూటమిని గెలిపించే అంశంపైనే దృష్టిపెట్టాన్నారు.  ప్రజాకూటమి గెలుపు కోసం తాను శాయశక్తుల ప్రయత్నిస్తున్నానని వెల్లడించారు. తమ పార్టీ విధానం ప్రకారం మెజారిటీ సాధించిన తరువాతే సీఎం అభ్యర్థిపై నిర్ణయం ఉందన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రజా కూటమి మెజారిటీ సాధించి తీరుతుందనే నమ్మకం తనకు ఉందన్న రేవంత్.. ఆ తరువాత గెలిచిన ఎమ్మెల్యేలంతా అభిప్రాయాలు తీసుకొని కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పరిశీలకులు  సీఎం అభ్యర్థల జాబితాను అధిష్టానానికి పంపుతారని.. పార్టీ అధ్యక్షుడు రాహుల్ నిర్ణయం మేరకు సీఎం ఎవరనేది అప్పుడే తేలుతుందని రేవంత్ అన్నారు. అయినా తనకు ముఖ్యమంత్రి పదవిపై ఆశతో తాను పనిచేయడం లేదని.. కాంగ్రెస్ ను గెలిచిపించడం తన ముందున్న లక్ష్యమని  తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.